చిత్తూరు

ఏపి ఆర్‌జెసిలో ఆదర్శ పాఠశాల విద్యార్థి ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరెడ్డిపల్లి, మే 26:మండలంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి ఇటీవల ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష -2016 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపాడు. బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో నివశిస్తున్న కరుణాకర్ గుప్తా, భువనేశ్వరమ్మల కుమారుడు భువేష్ ఇటీవల ప్రకటించిన ఏపిఆర్‌జెసి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి రాయలసీమ స్థాయిలో 48వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ గురువారం విద్యార్థిని పాఠశాలకు పిలిపించుకుని అభినందించారు. అనతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి భువేష్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడని, ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లోనూ 10 గాను 9.5 గ్రేడ్ పాయింట్ సాధించాడని ప్రశంసించారు. అదే విధంగా తాజాగా విడదలైన ఎపిఆర్‌జెసి ఫలితాల్లోనూ ఎంఇసి విభాగంలో 150 మార్కులకు గాను 102 సాధించి రాష్టస్థ్రాయిలో 212, రాయలసీమ స్థాయిలో 48వ ర్యాంకు సాధించి పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాడని కొనియాడారు. బోధనలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోవనేందుకు భువేష్ సాధించిన మార్కులే నిదర్శనమని, దీన్ని తల్లిదండ్రులు గుర్తించుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.