చిత్తూరు

భక్తులకు శరణాగతి నేర్పిన ఆళ్వార్లు, అన్నమయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 26: భగవంతుని తత్వాన్ని తెలుసుకునేందుకు శరణాగతి తప్ప మరో మార్గం లేదని ఆళ్వార్లు, అన్నమయ్య జనులకు తెలిపారని విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ జె మునిరత్నం తెలిపారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య వారి 608వ జయంతి ఉత్సవాలు గురువారం నాటికి ఆరవరోజుకు చేరుకున్నాయి. సదస్సుకు అధ్యక్షత వహించిన డాక్టర్ జె.మునిరత్నం ‘ అన్నమయ్య-నమ్మాళ్వార్’ అనే అంశంపై ఉపన్యసిస్తూ నమ్మాళ్వార్ ఆళ్వార్లలోనే ప్రధానమైన వాడని, తమిళ వైష్ణవ సాహిత్యానికి ఆయన ఎనలేని కృషిచేశారన్నారు. ఇక అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా పద సాహిత్యంతో వైష్ణవ ధర్మాన్ని వ్యాప్తిచేసిన విధానాన్ని వివరించారు. వీరిరువురూ మానవజాతిని జాగృతం చేసేందుకే ఈ కీర్తనలు రచించారన్నారు. అన్నమయ్య నందకాంశం, నమ్మాళ్వార్‌ది విష్వక్సేన అంశం అని, ఇద్దరూ ఒకే తిథిలో జన్మించిన కారణ జన్ములన్నారు. వీరి సంకీర్తనల్లో అహింస, సత్యగతి, భక్తి, శరణాగతి, నామసంకీర్తన ప్రధానంగా ఉన్నాయన్నారు. హింసకు దూరంగా ఉండి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నామసంకీర్తన చేస్తే ముక్తి కలుగుతుందని తమ కీర్తనల ద్వారా అవగతమవుతుందన్నారు. తిరుపతికి చెందిన వెంకటేశ్వరా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకులు డాక్టర్ దామోదర నాయుడు అన్నమయ్య సందేశం అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య సందేశాన్ని 7రకాలుగా విభజించవచ్చన్నారు. పద్యానికి, పదానికి సమాన గౌరవం ఇచ్చి కీర్తనలు రచించిన వారు అన్నమయ్య అన్నారు. అన్నమయ్య వాగ్గేయకారులకు, కవులకు, భాషా సందేశం ,కీర్తనలు, కీర్తన అంశాల విధాన సందేశం, తాత్విక సంగీత సందేశం ఇచ్చినట్లు వివరించారు. అన్నమయ్య సంకీర్తనల్లో రామాయణం, భగవద్గీత వేదాల్లోని అంశాలు చాలా వరకు ఉన్నాయన్నారు. వేదాల కంటే ముందునుంచి పురాణాలు ఉన్నాయనాయన్నారు. అన్నమయ్యకు అప్పటికి లభించిన అనేక పురాణ కథల నుంచి పలు అంశాలను గ్రహించారని తెలిపారు. తిరుపతికి చెందిన సునంద తాళ్లపాక కవుల రచనలో చక్రత్తాళ్వార్ ప్రశంశ అనే అంశంపై ఉపన్యసిస్తూ తాళ్లపాక కవులు సుదర్శ ఉపాసకులని, సుదర్శన చక్రాన్ని గురించి అనేక రూపాల్లో కీర్తించినట్లు వివరించారు. శ్రీ మహావిష్ణువు ఆయుధాల్లో సుదర్శనచక్రం ప్రధానమైందన్నారు. వైష్ణవ ఆలయాల్లోని ఉత్సవాల్లో చక్రత్ ఆళ్వార్‌కు ప్రత్యేక స్థానం కలిగి ఉంటుందన్నారు. కాగా సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు తిరుపతికి చెందిన బాలకృష్ణప్రసాద్ బృందం ఆలపించిన అన్నమయ్య నామసంకీర్తనా గానం ఆద్యంతం ఆహూతులను మైమరపించాయి. ఇక మహతి కళాక్షేత్రంలో చెన్నైకి చెందిన దివ్యసేనా బృందం నృత్యరూపకాలతో ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ఆకట్టుకున్న వాద్య సంకీర్తనా గోష్టి
అన్నమాచార్య సీనియర్ కళాప్రాజెక్టు ఇ మునికృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రాజెక్టుకళాకారులు అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన వాద్య సంకీర్తనా గోష్టి కళాప్రియులను ఆనందింపచేసింది. పరిపూర్ణ గరుడాద్రి, హరినామమే కడు, అన్నిమంత్రములు, మంగాంబుదిహనుమంత, ఎంత్రమాత్రమున, రామచంద్రుడితడు లాంటి అనేక అన్నమయ్య సంకీర్తనలను తమ వాయిద్య కచేరితోశ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈకార్యక్రమాన్ని అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.ముక్తేశ్వరరావు, డిప్యూటి ఇ ఓ బి.శారద ప్రారంభించారు. ఈకార్యక్రమంలో సూపరింటెండెంట్ సూర్యనారాయణ రెడ్డి, పి సి ఓ సావిత్రి,లత, టెక్నీషియన్ రమేష్ పాల్గొనగా జయంతి ,సావిత్రి యాంకరింగ్‌చేశారు. ఇక వాద్య సంకీర్తనాగోష్టి నిర్వహించిన వారిలో చక్రపాణి, బి ఎస్ ఆర్ కె పవన్‌కుమార్, ఆర్. రవిశంకర్, నాగేశ్వర రావు, జె. ఠాగూర్‌నాధరెడ్డి, టి.గిరినాథ్‌రెడ్డి, జి. ఉదయ్‌కుమార్, బి.కె భరద్వాజ్,గోపాల్,మునికన్నయ్య, ప్రసాద్, పి ఎన్ వి మురళీకృష్ణ, ఎస్.వేణుగోపాల్. టి.మురళి ఉన్నారు. అనంతరం టిటిడి అధికారులు కళాకారులకు స్వామివారి ప్రసాదం అందజేశారు.