చిత్తూరు

‘మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆర్థిక అంశంగా చూడొద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, మే 30: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్మించుకుంటున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఆర్థిక అంశంగా పరిగణించరాదని, సామాజిక అంశంగా చూడాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి పెంచలకిషోర్ అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పరిస్థితులను తెలుసుకునేందుకు మండల స్థాయి ఇంజనీర్లతో ఉపాధిహామీ సిబ్బంది, క్లస్టర్ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఇఓ మాట్లాడుతూ ఆరుబయట బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాదులు విసర్జిస్తే కలిగే సమస్యలను ప్రజలకు వివరించాలన్నారు. ఆర్థిక భారం మోయలేని లబ్ధిదారులకు స్థానిక ఏజెన్సీల ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను నిర్వహంచే సౌకర్యం కల్పించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు స్వచ్ఛంధ సేవాసంస్థలు కానీ, ప్రభుత్వేతర సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు. మండలంలోని నెన్నూరు గ్రామాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలనా గ్రామంగా ఎంపిక చేసినట్లు ఎంపిడివో జ్యోతి సిఇఓకు తెలిపారు. నెన్నూరుకు అనుబంధంగా వెంకటరామాపురం, పాతకందులవారిపల్లి, కుప్పం బాదూరు పంచాయతీలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా శాఖ ఎస్‌ఇ వేణు, ఇఇ విజయకుమార్, డిఇ భాస్కర్‌రెడ్డి, ఎఇలు జయచంద్ర, శే్వత, పిఆర్ ఎఇ సుధాకర్, ఇఓ పిఆర్‌డి రవీంద్రనాథ్ ఠాగూర్, క్లస్టర్ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఐసిడిఎస్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.