చిత్తూరు

‘సంచారజాతుల సమస్యలు పరిష్కరించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛిత్తూరు, జూన్ 10 : రాష్ట్రంలోని సంచారజాతులు, విముక్త జాతల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంచార జాతుల సంఘం నేతలు మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడారు. రవి మాట్లాడుతూ ఐదేళ్లుగా సంచార జాతులు చేసిన పోరాటాలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల అభివృధ్ది కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అయితే తమ జాతుల సమస్యల పట్ల అటు ప్రభుత్వంగాని, ఇటు అధికారులు గాని స్పందిచక పోవడం దారుణమన్నారు. ముఖ్యంగా తమజాతిలో కొంత మందికి ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, రేషన్‌కార్డులు మంజూరు కాకపోవడం వంటి సమస్యలను పరిష్కరించే వారే కరువయ్యారని పేర్కొన్నారు. వీటితో పాటు తమజాతి ప్రజల పిల్లలకు కుల, ఆదాయ, జనన, మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేసేవారే కరువయ్యారని వాపోయారు. ఈ కారణంగా సంబంధిత జాతి వారు అక్షరాస్యతలో బాగా వెనుకబడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన లబ్ది సైతం అందకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో సంఘం నేతలు అట్లూరి శ్రీనివాసులు, తోటపాళ్యం వెంకటేష్, వేమన్న, కె చంద్రశేఖర్, ఈశ్వరయ్య, వెంకటేశులు, ధనరాజయ్య, రెడ్డెప్ప, అంకయ్య, ధనంజయ తదితరులు పాల్గొన్నారు.