చిత్తూరు

రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 13: తిరుమల శ్రీవారిని ఒకే రోజులో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. ఈ నెల 12వ తేదీన ఒకే రోజులో సుమారు 1,00,625 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం రికార్డుగా నిలిచింది. అదేవిధంగా అదేరోజున అలిపిరి, శ్రీవారి మెట్టునడక మార్గాల్లో సుమారు 51వేల మంది భక్తులు తిరుమలకు కాలినడకన చేరుకున్నారు. అలానే ఆదివారం రోజున టిటిడి అన్నప్రసాదం విభాగం సుమారు 90వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాద వితరణ చేసుంటారని ఒక అంచనా. ఇక కల్యాణ కట్ట విభాగం ఈ నెల 11వ తేదీన సుమారు 69,987 వేల మందికి 12వ తేదీన 45 వేల మందికి పైగాభక్తులకు తలనీలాలు తీశారు. కాగా 11వ తేదీన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 2.58 కోట్లు ఆదాయం లభించగా, సోమవారం 3.87 కోట్లు ఆదాయం లభించింది. ఇక సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. దీంతో సర్వదర్శనం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకునేందుకు 10 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అలానే ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యన 63,772 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు.