చిత్తూరు

ఆగస్టు తరువాత మహా కుంభాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, జూన్ 14: శ్రీ కాళహస్తీశ్వరాలయానికి ఆగస్టు తరువాత మహాకుంభాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు తెలిపారు. మంగళవారం దేవస్థానం కార్యాలయాల్లో బోర్డు సభ్యులు గుర్రప్పశెట్టి, రమేష్, చంద్ర, నారాయణ, ప్రమీలమ్మ తదితరులతో మహాకుంబాభిషేకంపై చర్చించారు. 2000 సంవత్సరంలో కుంభాభిషేకం జరిగింది. 2012లో కుంభాభిషేకం జరగాల్సి ఉందన్నారు. అయితే వాయిదా పడటం వల్ల త్వరగా ఆ కార్యక్రమాన్ని చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆగస్టు తరువాత మహాకుంభాభిషేకాన్ని నిర్వహించే ప్రతిపాదన ఉందని, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో సమగ్రంగా చర్చించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందని, మరింత ఆలస్యం కాకుండా కుంభాభిషేకాన్ని నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కైలాసగిరి చుట్టూ రోడ్డును వేయడానికి నిర్ణయించామని ఈ సాధ్యాసాధ్యాలను స్వయంగా పరిశీలిస్తామన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి తరువాత వచ్చే పశువుల పండుగ, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కొండచుట్టు ఉత్సవం జరుగుతుందని, అందుకోసం రోడ్డును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పట్టణంలోని కొందరు ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తున్నారని, రోడ్డును అభివృద్ధిచేస్తే మరికొంత మంది గిరి ప్రదక్షిణలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. దీనిపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అంచనా తయారుచేయిస్తామని తెలిపారు.