చిత్తూరు

గ్రామీణ పేదల కోసం మొబైల్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 17: గ్రామీణ పేద ప్రజల కోసం త్వరలో మొబైల్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్‌రెడ్డి చెప్పారు. స్విమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం పుత్తూరు మండలం, కె వి ఆర్ పురం గ్రామంలోని ఎంపిపి స్కూల్లో డాక్టర్ ఎన్ టి ఆర్ ఉచిత వైద్య సేవాశిబిరాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటి వైద్య సేవలను అందించాలన్న ఆశయంతోనే ఈ వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మారుమూల ప్రాంతాలకు సైతం చేరుకుని ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ వైద్య శిబిరానికి వైద్యం కోసం వచ్చిన గర్భిణి అయిన గిరిజన మహిళ ధనలక్ష్మిని పరీక్షించిన వైద్యులు వెంటనే ఆమెను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి సకాలంలో తరలించడంతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే ఈ వైద్య శిభిరంలో 576 మంది రోగులను పరీక్షించి 18 మందిని స్విమ్స్, ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేశారు. వీరికి ఉచిత వైద్యంతోపాటు, శస్తచ్రికిత్సలు చేయనున్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ సుభద్రమ్మ, మోహన్‌రాజు, దేశమ్మ, కమలమ్మ, మాధవయ్య, డాక్టర్లు శర్మ, అంజని, వనజ, పి ఆర్వో రాజశేఖర్, ఆమ్‌కోలు సుందరరాజ్, అమరేంద్ర, ఎన్ టి ఆర్ వైద్య సేవా ట్రస్ట్ టీం లీడర్ పళని పాల్గొన్నారు.