చిత్తూరు

జిల్లాలో బదిలీల ప్రక్రియ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు,జూన్ 17: జిల్లాలో ఉద్యోగలు బదలీల పక్రియ ప్రారంభమైంది. తొలిసారి ఆన్ లైన్ ద్వారా బదలీల దరఖాస్తులను స్వీకరించ ఈ పక్రియను చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఆదేశించింది, దీంతో పలుశాఖల్లో బదలీలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంలో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు ఒకే ప్రాంతంలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకొన్న అన్ని క్యాడర్ల ఉద్యోగులకు తప్పక బదలీ కానున్నారు. అలాగే మూడేళ్ల సర్వీసు పూర్తి ఆయిన ఉద్యోగలు దరఖాస్తులను సైతం పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే మూడేళ్లు సర్వీసు విషయంలో న్యాయబద్దంగా ఉన్నవారి దరఖాస్తులను మాత్రం పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారి చేసినట్లు సమాచారం. వ్యవసాయ శాఖను మాత్రం బదలీల నుంచి మినహాయించారు. జిల్లా పంచాయితీరాజ్ లో పరిధిలో బదలీల పర్వం ప్రారంభం కావడంతో జడ్పి కార్యాలయం సందడిగా మారింది. ఇందులో జిల్లా పరిషత్, మండల పరిషత్ , పీఆర్ ఇంజనీరింగ్, విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 95 మంది ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు బదలీ అయ్యే అవకాశం ఉంది. ఈ కార్యమ్రమాన్ని జిల్లా పరిషత్ అధికార యంత్రంగా కొనసాగించనున్నది. శుక్రవారం రెవెన్యూ ఉద్యోగులు బదలీల కౌనె్సలింగ్ ప్రారంభమైంది. రెవెన్యూశాఖలో ఐదేళ్లుపూర్తి చేసుకొన్న వారు 40 మంది ఉన్నారు. అందులో ఒక తాహశీల్దారు, 21మంది డిప్యూటీ తహశీల్దార్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఎనిమిది మంది వీఆర్‌వోలు, ఇద్దరు టైపిస్టులు ఉన్నారు. వీరందురు బదలీ కావడం ఖాయం కాగా, ఈశాఖలో మూడేళ్లు పూర్తి చేసుకొన్న వారు వంద మందికిపైగా ఉన్నారు వారు కూడా దరఖాస్తులు చేసుకోవడంతో వీరి పనితీరు తదతర అంశాలను పరిశీలించి అందులో కొందరికి స్థానచలనం కల్పించే అవకాశం ఉంది. గ్రామ కార్యదర్శుల విషయానికివస్తే గత ఏడాది భారీ సంఖ్యలో వీరు బదలీలను నిర్వహించారు. ప్రస్తుతం అతి తక్కువ సంఖ్యలో స్థానచలనం కానున్నారు. డీఆర్‌డిఏ శాఖలు ఐదేళ్లు పూర్తి చేసుకొన్నవారు సుమారు 130 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం, ఉద్యోగలు పనితీరు ఆధారంగా బదలీలను చేపట్టనున్నారు. జిల్లాలో బదలీల వ్యవహారంలో యథావిధిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడంతోపాటు పనితీరును పరిగణలోకి తీసుకోవాలని ఆందులో ఎలాంటి తప్పదాలు చోటు చేసుకోకూడదని కలెక్టర్ జిల్లా అధికారులకు ఇటీవలనే ఆదేశాలు జారీ చేశారు, దీంతో జిల్లా అధికార యంత్రాంగం బదలీలను పాదర్శకంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా అన్నిశాఖల్లో ఈ పక్రియను సోమవారంతోపూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది.