చిత్తూరు

భూ సేకరణపై రైతుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, జూన్ 23 : పరిశ్రమల పేరుతో వందల ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడంపై తొట్టంబేడు మండల రైతులు ఆగ్రహించారు. మండలంలోని కాసరం, చేమూరు, చియ్యవరం గ్రామాలకు చెందిన రైతులు స్వచ్ఛందంగా తొట్టంబేడు రెవెన్యూ కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. పంటలు పండించుకొని కుటుంబాలను పోషించుకుంటున్నామని, పరిశ్రమలు పెట్టి భూములను లాక్కోవద్దని డిమాండ్ చేశారు. పరిశ్రమలు పెట్టాలని తాము ప్రభుత్వాన్ని కోరలేదని, పరిశ్రమల వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. రైతుల ఆందోళన తెలుసుకున్న సిపిఎం నాయకులు పుల్లయ్య, మణి, గురవయ్య తదితరులు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. అయితే రాజకీయ పార్టీల మద్దతు తమకు అవసరం లేదని, తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు వస్తే రాజకీయం చేస్తారని తెలిపారు. భూ సేకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.