చిత్తూరు

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌కు అందరూ సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, జూన్ 26: ఆంధ్రప్రదేశ్‌లో అందరూ ఆరోగ్యంగా ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకు అందరూ సహకరించాలని శాఫ్ చైర్మన్ పిఆర్ మోహన్ పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలో జరిగిన ఒలింపిక్ రన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఒలింపిక్ రన్ వల్ల శారీరక ఆరోగ్యం బాగుపడుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను అన్నిచోట్లా నిర్వహించాలన్నారు. ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల వారు ఆరోగ్యకార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షుడు గురవయ్యనాయుడు, ఎంజిఎం సంస్థల అధినేత మల్లికార్జున నాయుడు, బిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి రమణ, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని బాబు అగ్రహారం మునిసిపల్ ఉన్నత పాఠశాల నుంచి ఒలింపిక్ రన్ ప్రారంభమైంది. నెహ్రూవీధి, తేరువీధి, బజారు వీధి, నగరి వీధులలో ఒలింపిక్న్ జరిగింది. స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.