చిత్తూరు

నాదనీరాజనంలో ఎ-గ్రేడ్ కళాకారులు మరింత మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 27: తిరుమలలో ప్రతిరోజూ సాయంత్రం నిర్వహిస్తున్న నాదనీరాజనం కార్యక్రమంలో ఎ-గ్రేడ్ కళాకారులు మరింత మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇఓ మాట్లాడుతూ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు పొందిన ప్రముఖ కళాకారులతో నాదనీరాజనం వేదికపై సంవత్సరంలో వారు కోరిన తేదీల్లో ప్రదర్శన ఇచ్చేందుకు ఆహ్వానించాలని, నాదనీరాజనం సెలక్షన్ కమిటీలో ఉత్తర భారతదేశానికి చెందిన ప్రముఖ కళాకారులను ఉంచాలని సూచించారు. టిటిడి సామాజిక కార్యక్రమాల్లో సమన్వయం చేసుకొని వచ్చే నెల నుంచి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేయవలసిందిగా టిటిడి ముఖ్య వైద్యాధికారిని ఇఓ ఆదేశించారు. కృష్ణా పుష్కరాల్లో రాగి, వెండి డాలర్లను తయారుచేసి భక్తులకు తక్కువ ధరలకు విక్రయించేందుకు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. మార్కెటింగ్ విభాగానికి సంబంధించి బెల్లం, చింతపండు, పప్పుదినుసుల నాణ్యతలో రాజీలేకుండా, సరుకులు వచ్చిన వెంటనే తనిఖీలు నిర్వహించి, ఆమోదయోగ్యం కానివాటిని వెనుకకు పంపివేయాలన్నారు. రోజువారి, అత్యవసర సమయంలో ఏయే సరుకులు ఎంత అవసరం, గోడౌన్ నిల్వ సామర్థ్యం గురించి చర్చించేందుకు మార్కెటింగ్ విభాగంలో సమావేశం ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ముక్తేశ్వరరావు, న్యాయాధికారి, వెంకటరమణ, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎఫ్‌ఏ అండ్ సిఏవో బాలాజి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కామాంధుడికి యావజ్జీవ జైలు శిక్ష
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, జూన్ 27: అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడికి యావజ్జీవ జైలు శిక్షతో పాటు 20వేల రూపాయలు జరిమానా విధిస్తూ చిత్తూరు 8వ అదనపు జడ్జి చిదానందం సోమవారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తవణంపల్లె మండలానికి చెందిన గజేంద్ర కుమార్తె (7) పాకాల మండలం దామల్‌చెరువులోని అవ్వ ఇంటిలో ఉండేది. అవ్వ కూలీ పనులు చేసుకొని జీవనం కొనసాగించేది. ఈ తరుణంలో అక్కడే ఉన్న బుజ్జి అనే వ్యక్తి కూడా కూలీ పనితో జీవనం నెట్టుకొచ్చేవాడు. అయితే 2015 జూలై 10న బుజ్జి ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి స్థానిక ఏటి వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారిని ఇంటి వద్ద వదలి పారిపోయాడు. తదుపరి ఆ చిన్నారి తీవ్ర రక్తస్రావంతో ఇంట్లో పడి ఉండగా గమనించిన అవ్వ తన కుమారుడైన గజేంద్రకు విషయం తెలిపింది. దీంతో గజేంద్ర పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బుజ్జి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడని రుజువు కావడంతో ఆ కామాంధునికి జడ్జి యావజ్జీవ శిక్షతో పాటు 20వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

‘ఉపాధి పనులపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు’
యాదమరి, జూన్ 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపాధిహామీ పనులపై సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ శంకరప్ప అన్నారు. సోమవారం మండలంలో జరిగిన ఉపాధిహామీ పనుల సామాజిక తనిఖీపై బహిరంగ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎపిడి మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ 2015 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు మండలంలో 1,68,72,493 రూపాయల వ్యయంతో పనులు జరిగినట్లు తెలిపారు. అందులో కూలీలకు 1,39,05,622 రూపాయలు, మెటిరీయల్‌కు 29,61,877 రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. అనంతరం పంచాయతీల వారీగా పనుల వివరాలను తెలియచేశారు. ముఖ్యంగా మండలంలో ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యంతో పనులు వెనుకబడుతున్నాయన్నారు. సకాలంలో కూలీలకు చేసిన పనులకు బిల్లులు ఇవ్వడంతో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అదేవిధంగా కొన్ని పంచాయతీల్లో చేసిన పనులకు కూడా తగిన బిల్లులు ఇవ్వకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులను పర్యవేక్షించి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మండలంలో పంట సంజీవిని పథకం ద్వారా పనులు చాలా వెనుకబడ్డాయన్నారు. రైతులకు అవగాహన కల్పించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉపాధి పనులపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఎపిడి సుబ్రహ్మణ్యం, ఎంపిడిఓ పారిజాతం, టెక్నికల్ అసిస్టెంట్లు నందిని, హంసవేణి, సర్పంచ్ రాజశేఖర్‌నాయుడు, రైతులు పాల్గొన్నారు.

కర్ణాటకకు చెందిన బడా స్మగ్లర్‌పై పిడి యాక్ట్
రేణిగుంట, జూన్ 27: కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్ జిల్లా హోస్పేట్ తాలూకా జగదనహళ్లి, గోవిందాపురం గ్రామానికి చెందిన జిఎం వెంకటేష్ (30)పై పిడి యాక్ట్ నమోదుచేసినట్లు తిరుచానూరు సిఐ కెవి సురేంద్ర నాయుడు తెలిపారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ శేషాచల అటవీప్రాంతంలో ఎర్రచందనాన్ని నరికి అక్రమ రవాణా చేయడానికి అలవాటుపడి కరుడుగట్టిన నేరస్తుడుగా ఎదిగి శాంతిభద్రతలకు వెంకటేష్ విఘాతం కల్పిస్తున్నాడన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా రేణిగుంట అర్బన్, పీలేరు, ఎర్రావారిపాళెం, కలకడ, తిరుచానూరు, చంద్రగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేయడంతో వెంకటేష్‌పై కేసులు నమోదుచేశారన్నారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇతడు పిటి వారెంట్‌పై అరెస్ట్ కాబడి తిరుపతి సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడన్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన క్రమంలో జిల్లా కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించామన్నారు. కలెక్టర్ సిద్దార్థజైన్ ఇచ్చిన ఆదేశాల మేరకు వెంకటేష్‌పై పిడి యాక్ట్ నమోదుచేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడిన తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డి (33) రేణిగుంట మండలం కుర్రకాలువకు చెందిన కె.బాలాజి అలియాస్ బాల (31) ఆటోడ్రైవర్ హరిబాబు (29)లను కూడా ఏప్రిల్ 7వ తేదీన అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరు చైతన్యపురం ప్రైమరీస్కూల్ తూర్పువైపున రబ్బరు చెట్ల పొదల్లో ఎర్రచందనం రవాణా చేసేందుకు దాచి ఉంచిన మహేంద్ర స్కార్పియో వాహనాన్ని, అందులో ఉన్న 206 కేజీలు కలిగిన 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కేసు నమోదుచేశామన్నారు.