చిత్తూరు

భూగర్భ జలాలు అడుగంటితే భవిష్యత్ అంధకారమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: భూగర్భ జలాలు అడుగంటిపోతే భవిషత్తు అంథకారమేనని ప్రతివర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే విధంగా సాగునీటి సంఘాలు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు అంబేద్కర్ భవన్‌లో జలవనరులశాఖ ఆధ్వర్యంలో నీటి సంఘాల సభ్యులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ చిత్తూరు జిల్లాలో గత పదేళ్లుగా రైతులు కరవుతో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదన్నారు. జలవనరులు పటిష్టంగా ఉన్నప్పుడే కరవును ఎదుర్కొనే శక్తి ఉంటుందన్నారు. ఇందుకు వర్షపునీటినినిల్వ ఉంచుకునే విధంగా గ్రామ స్థాయిలోనే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం కావాలన్నారు. ఇందులో సాగునీటి సంఘాలు కీలకపాత్ర వహించాలన్నారు. జిల్లాలో గాలేరు- నగరి, హంద్రీ- నీవా పనులతో పాటు కండలేరుకు నీటి మళ్లింపు పనులుకూడా కొనసాగుతున్నాయని, అయితే గతానుభవం దృష్టిలో ఉంచుకొని ఉన్న నీటిని వృథా కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం జలదర్శిని కార్యక్రమం చేపట్టిందని, దీనిని సాగునీటి సంఘం సద్వినియోగం చేసుకోవాలన్నారు. జలదర్శినితో ఆయా గ్రామాల్లో ఉన్న జలవనరులను కాపాడుకునే విధంగా సాగునీటి సంఘాలు ప్రజల్లోచర్చ కొనసాగించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనలోకూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద పదిలక్షల రూపాయల వరకు సాగునీటి సంఘాలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది వర్షం కురిసినా అప్పుడే పలుచోట్ల నీటి మట్టం ఘణనీయంగా తగ్గిందని దీనికి కారణం నీటిని వృథా చేయడమే అన్నారు. వచ్చే సంవత్సరానికి ముందస్తుగానే గ్రామాల్లో నీటి నిల్వలపై చర్చకార్యక్రమం కొనసాగించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా కృషి చేయాలన్నారు. గతంలో కురిసిన వర్షాలతో యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న చెరువులు, కుంటల కోసం 300కోట్ల వ్యయం చేసామన్నారు. భూగర్భజల నీటిమట్టం3మీటర్ల నుంచి 8మీటర్లు లోతు వరకు ఉండాలని, అలా లేనిపక్షంలో అక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోయాయని గుర్తించాలన్నారు. అలాంటి ప్రాంతాల్లో బోర్లువేయడాన్ని స్వస్తి పలకాలన్నారు. గతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 2600గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయడం జరిగిందని, అందుకోసం నెలకు సుమారు 7కోట్లు వ్యయం చేయాల్సి వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితులు జిల్లాకు ఇక రాకూడదన్నారు. ప్రతి నీటి సంఘాల ప్రతినిధులు నీటినిల్వలపై శ్రద్ధచూపాలన్నారు. పది నీరుచెట్టు నిధులు పక్కదారి పడితే సహించేది లేదన్నారు. ప్రతి నీటి సంఘానికి గ్రేడింగ్ ఇస్తామన్నారు. గతంలో నిర్లక్ష్యం చేయడం వలనే పడమర ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాలు చిన్నాభిన్నమై వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా తక్కువ నీటితో ఎక్కువ లాభం చేకూర్చే విధంగా బిందు, తుంపర్ల సేద్యం తదితర వాటిపై మక్కువ చూపాలన్నారు. అలాగే పంట మార్పిడి విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నీటిపొదుపు విషయంగా గ్రామాల్లో చర్చ జరిగితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. పంట సంజీవని, జలదర్శిని, నీరు-చెట్టు కార్యక్రమాలను సాగునీటి సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జలవనరులశాఖ ఎస్‌ఇ రామకృష్ణ మాట్లాడుతూ గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవం రానున్న రోజుల్లో రాకూడదని అందుకే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఉన్న నీటిని ఎలా వినియోగించాలి అనే అంశంపై సంఘాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దీనిని ప్రతి సాగునీటి సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో నీటినిల్వలు పెరిగే విధంగా కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో భూగర్భజలశాఖ డిడి శంకరయ్య, జలవనరులశాఖ ఇఇ కృష్ణమూర్తి, జిల్లాలోని నీటి సంఘాల సభ్యులు హాజరైయ్యారు.
వేద నారాయణ స్వామి, పల్లికొండేశ్వర స్వామి ఆలయాల్లో
బాంబు స్క్వాడ్ తనిఖీ
నాగలాపురం, మార్చి 5: శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్ర, తమిళనాడు మండలాల సరిహద్దులో ఉన్న శ్రీ సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో, వేదనారాయణ స్వామి ఆలయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం చిత్తూరు బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఆలయంలో ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేనట్టు గుర్తించి ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలుపుతామని, ఆలయాలపై నిఘా ఉంచుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ కానిస్టేబుల్ రెడ్డెప్ప, శ్యామ్, మునిరత్నం రెడ్డి, కుమార్ పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
* కలెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, మార్చి 5: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యాధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రభుత్వ వైద్య శాలలో వైద్య సేవలు పొందే విధంగా ప్రభుత్వ వైద్యులు చొరవ చూపాలన్నారు. ప్రధానంగా వైద్యాధికారులు అందుబాటులో ఉంటూ సమయ పాలన పాటించాలన్నారు. రోగులతో సత్సంబందాలు కలిగి ఉండి వారికి మెరుగైన వైద్యసేవలతో పాటు రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వైద్యులదే అన్నారు. విధులు నిర్వహించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలవరీ శాతం పెంచాలన్నారు. మందులు తదితర రోగులకు అవసరమయ్యే వాటిని విధిగా అందించాలన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అనేక సదుపాయాలు కల్పిస్తుందని ఇవన్నీ ప్రజలకు అందించాల్సిన బాధ్యత సంభందిత వైద్యులదే అన్నారు. నిరంతరం ఆసుపత్రిలో పర్యవేక్షణ కొనసాగాలని తెలిపారు. ప్రతి రోజు నిర్దేశించిన వైద్యులు సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తే ప్రజలు విధిగా ప్రభుత్వ ఆసుపత్రికే వస్తారని తద్వారా ప్రభుత్వ వైద్య శాలకు మంచి పేరు వస్తుందన్నారు. ఈకార్యక్రమంలో డిసిహెచ్ ఎస్ సరళ, ఇతర వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా వారణాసిలో శ్రీవారి చక్రస్నానం
తిరుపతి, మార్చి 5: వారణాసిలోని అశ్వమేథ ఘాట్ వద్ద పవిత్ర గంగానదిలో శనివారం వైభవంగా నిర్వహించిన శ్రీవారి చక్రస్నాన కార్యక్రమంలో టిటిడి ఇ ఒ డాక్టర్ డి సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు. పవిత్రమైన మాఘమాసం సందర్భంగా దేశ వ్యాప్తంగా పవిత్ర నదుల్లో చక్రస్నానాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈకార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓ ఎస్ డి పాలశేషాద్రి తదితరులు పాల్గొన్నారు. కాగా 6వ తేదీన అలహాబాదులోని త్రివేణి సంగమం వద్ద ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య, మార్చి 9న కురుక్షేత్రంలో చక్రస్నానం నిర్వహించనున్నారు.

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేస్తే జరిమానాలు
తిరుపతి, మార్చి 5: తిరుపతి నగరంలోని ప్రధాన వీధుల్లో ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేస్తే జరిమానాలు తప్పవని తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ వినయ్‌చంద్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నగరంలోని పలువురు వ్యాపారులు, పండ్ల, తోపుడుబండ్ల వ్యాపారులు ఫుట్‌పాత్‌లను అక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. ఇందువల్ల నగర ప్రజలు, భక్తులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. కనుక ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వారు వెంటనే వాటిని ఖాళీచేయాలని లేకుంటే పోలీసుల సహకారంతో వాటిని ఖాళీచేయించడమేకాకుండా అపరాదరుసుం కూడా వసూలు చేయడం జరుగుతుందని చెప్పారు.
నేడు నాగరాత్రి
శ్రీకాళహస్తి, మార్చి 5: శ్రీ కాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాల్గవ రోజైన ఆదివారం నాగరాత్రి ఉత్సవం జరగనుంది. పాల సముద్రాన్ని అమృతం కోసం చిలకడానికి నాగదేవతలు పరమేశ్వరుడిని పూజించడానికి చేసే ఉత్సవాన్ని నాగరాత్రి అంటారు. ఈ సందర్భంగా శేష వాహనంపై స్వామి ఊరేగుతాడు. అమృతం కోసం దేవతలు,రాక్షసులు పోటీపడటం, చిలకడానికి ముందుగా నాగదేవతలు పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం నాగరాత్రి ఉత్సవాన్ని నిర్వహిస్తుంది.మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ కాళహస్తి క్షేత్రంలో గంధర్వరాత్రి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లు హంస, యాళి వాహనాలపై పట్టణంలో ఊరేగారు.
వైభవంగా కల్యాణ వేంకటేశ్వరస్వామి రథోత్సవం
చంద్రగిరి, మార్చి 5: శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవంలో కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవేరులతో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్యపూజా కైంకర్యాలను నిర్వహించి వేచి ఉన్న భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 8-9.30 గంటల మధ్యలో అత్యంత వైభవంగా అలంకరించిన రథోత్సవంలో శ్రీదేవి, భూదేవి కల్యాణ వెంకన్న ఉత్సవ విగ్రహాలను ఉంచి పట్టువస్త్రాలతో వైభవంగా అలంకరించారు.అనంతరం సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవలో భాగంగా శ్రీదేవి, భూదేవి కల్యాణ వెంకన్న ఉత్సవ విగ్రహాలను తూగుటుయ్యాలలో ఉంచి వైభవంగా అలంకరించి హారతులు సమర్పించారు. అన్నమయ్య కీర్తనలు వింటూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అశ్వవాహనంపై కల్యాణ వెంకన్న శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉంచి వైభవంగా అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ ఇ ఓ వెంకటయ్య, ఎ ఇ ఓ ధనంజయులు తదితరులు పాల్గొన్నారు.

గజవాహనంపై ఊరేగిన
పద్మావతి అమ్మవారు
తిరుచానూరు, మార్చి 5: శ్రీ పద్మావతి అమ్మవారు శనివారం జన్మనక్షత్రమైన ఉత్తరాషాఢ సందర్భంగా గజవాహనంపై ఊరేగుతూ భక్తుకు దర్శనమిచ్చారు. ఇందులో బాగంగా అమ్మవారి సుప్రబాత సేవతో మేల్కొలిపి నిత్యపూజలను, అభిషేకాలను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు అమ్మవారిని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో లక్ష్మీ పూజ, కల్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం సర్వాలంకార భూషితురాలైన అమ్మవారు గజవాహనంపై కొలువుదీరి తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటి ఇ ఒ చెంచులక్ష్మి, ఎ ఇ ఒ రాధాకృష్ణ ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో...
నాగలాపురం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 6వ రోజు సందర్భంగా నాగలాపురం మండలం సురుటుపల్లిలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో శనివారం గజవాహనంపై శ్రీ వాల్మీకేశ్వర స్వామి, మరగదాంబిక అమ్మవారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఉదయం 5 గంటలకు ఆలయం తెరచి శుద్ధిచేసి శ్రీ వాల్మీకేశ్వర స్వామికి, శ్రీ మరగదాంబిక అమ్మవారికి , శ్రీదాంపత్య దక్షిణామూర్తికి విశేష అభిషేక అలంకరణలు చేసి నైవేద్యం సమర్పించి మహా హారతి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. సాయంత్రం 5 గంటలకు యాగశాల పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రదోష మండపంలో శ్రీ వాల్మికేశ్వర స్వామి, మరగదాంబిక అమ్మవార్లను ఏర్పాటుచేసి వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణలుచేసి గజవాహనంపై వేంచేపుచేసి మాడ వీధుల్లో ఊరేగించారు. వచ్చిన భక్తులకు ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అందరికీ స్వామి, అమ్మవార్ల దర్శనం, ప్రసాదం అందేలా ఆలయ ఇ ఓ వెంకటముని తగు ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కార్తికేశన్, బాలచందర్, ఉభయదాతలు ఒంగోలు డి ఎస్పీ ఢిల్లీబాబు, జెబి ఆర్ పాఠశాల కరస్పాండెంట్ మునిరత్నం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వ్యాపార కేంద్రాలుగా మారిన మఠాలపై సిబిఐ విచారణ జరిపించాలి
* హిందూ చైతన్య సమితి డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, మార్చి 5:్ధర్మిక కేంద్రాలుగా ఆధ్యాత్మిక చింతనకు వేధికలుగా ఉండాల్సిన మఠాల పరమార్థాన్ని తిరుమల్లోని మఠ నిర్వాహకులు మరచి వ్యాపార నిలయాలుగా మార్చేస్తున్నారని ఇందుకు సంబందించి సి బి ఐ, సి బి సి ఐడి చేత విచారణ జరిపించాలని హిందూ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మా ఓంకార్, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సంచాలకులు డాక్టర్ సప్తగిరి ప్రసాద్‌లు డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల్లో మరింత భక్తి వాతావరణాన్ని కల్పిస్తామని మఠాలు నిర్మించి నేడు వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చేశారని ఆవేధన వ్యక్తం చేశారు. మఠం అంటే దేవాలయాలకు ప్రతి రూపమని, నిత్యం భజనలు,్భక్తి ప్రవచనాలతో మారుమోగాలని, అన్నదానాలతో విరాజిల్లాలన్నారు. ఇది భారతదేశంలో జరగుతున్న ఒక సంస్కృతి అన్నారు. అయితే తిరుమల్లో మఠాలంటే లాడ్జీలు, కల్యాణ మండపాలు,్భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసే వసూలు కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. మఠాలు రౌడీలకు, ఘర్షణలకు నిలయాలుగా మారుతున్నాయన్నారు. ఇటీవల పుష్పగిరి చారిటబుల్ ట్రస్టులో జరిగిన తంతు చూస్తే మఠం నిర్వాహకులకు ధనప్రవాహం ఏలా సాగుతోందో అర్థమవుతోందన్నారు. ఏటా 200 నుంచి రూ.400 కోట్లు ఆదాయం గడిస్తున్నారన్నారు. అదే సమయంలో టిటిడికి వందలకోట్లు నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జయపాల్, సుమన్‌నాయుడు, కుమార్, సునీల్, గౌతమ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాఘ్ర,గజవాహనాలపై ఊరేగిన కపిలేశ్వరస్వామి
తిరుపతి, మార్చి 5: శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఆరవ రోజైన శనివారం ఉదయం స్వామివారు వ్యాఘ్ర వాహనం, సాయంత్రం గజ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలు ఆలయం నుంచి బయలుదేరి కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ ఎల్‌టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్ జి ఒ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. కాగా ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య అర్చకులు శ్రీ సోమస్కందమూర్తి, శ్రీకామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం నిర్వహించారు.
‘ద్రోణాచార్య పథకానికి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి’

తిరుపతి, మార్చి 5: బ్రాహ్మణ యువతీ, యువకులు వృత్తి నైపుణ్య, ద్రోణాచార్య స్కీమ్ ద్వారా స్వయం ఉపాధి, చిన్న తరహాపరిశ్రమల స్థాపన కొరకు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు చిత్రపు హనుమంతరావు కోరారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సి ఎం నారాచంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమ స్థాపన కొరకు రూ.2లక్షలు నుంచి రూ. 5కోట్ల వరకు గల యూనిట్లను మంజూరు చేస్తారని తెలిపారు. అలాగే 50 సంవత్సరాలు పైబడిన వృద్దులకు చికిత్సకోసం చరక పథకాన్ని కూడా ప్రవేశపెట్టారని అన్నారు. ఈ రెండు పథకాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం 9440066267 సెల్ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఏపిబిసిసి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సి.స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ సి ఎం చంద్రబాబు నాయుడు భారతీ పథకం ద్వారా నిరుపేద బ్రాహ్మణ విద్యార్థుల చదువుల కోసం దాదాపు 20వేల కోట్ల రూపాయలను వారి అకౌంట్లలో జమచేశారని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిణ్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో షేర్ హోల్డర్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రూ.100 రిజిస్ట్రేషన్ రుసుము, రూ.500 షేర్ కాపిటల్‌ను ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నెంబర్ 032210100196119, ఐ ఎఫ్ సి కోడ్ ఎ ఎన్ డి 0000322, క్రిష్ణలంక బ్రాంచ్, విజయవాడలో జయచేయాలన్నారు. ఆ రశీదుతోపాటు తమ ఆధార్‌కార్డు, ఓటరు ఐడి, పాన్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైసు ఫోటోను జతచేయాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ఇందుకు సంబందించిన దరఖాస్తులు తిరుపతిలోని కార్యాలయంలో లభిస్తాయని చెప్పారు. ఈవిలేఖరుల సమావేశంలో సి.వి.రమణరావు, మురళీధర్, సత్యనారాయణశర్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.