చిత్తూరు

పాత తరం వైద్యుల అనుభవాలను కొత్తతరం అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 2: పాతతరం వైద్యుల అనుభవాలను నేటి యువ వైద్యులు అందిపుచ్చుకొని రోగులకు సేవలందిస్తే వృత్తికి సార్థకత చేకూరుతుందని ఐ ఎం ఎ తిరుపతి శాఖ అధ్యక్షురాలు, ప్రముఖ మధుమేహ వ్యాధి నిపుణురాలు, హర్షిత హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ కృష్ణప్రశాంతి పిలుపునిచ్చారు. డాక్టర్ బిసి రాయ్ జయంతి, వర్థంతిని పురస్కరించుకొని స్థానిక ఐ ఎం ఎ భవన్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డాక్టర్స్‌డే సందర్భంగా 70 సంవత్సరాలు దాటిన 30 మంది డాక్టర్లను ఐఎంఎ ఆధ్వర్యంలో సన్మానించారు. ఇందులో ప్రధానంగా 80 సంవత్సరాల వయస్సు కలిగి ఐఎంఎ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ వి కొండారెడ్డిని గజమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేసి దుశ్శాలువతో సన్మానించారు. స్విమ్స్ మాజీ సంచాలకులు డాక్టర్ జి సుబ్రహ్మణ్యం, ఆయన సతీమణి డాక్టర్ జి సునీతా సుబ్రహ్మణ్యం పేరున ఉత్తమ డాక్లర్ల అవార్డును తొలిసారిగా అందించారు. ఇందుకు సంబంధించి 2012 సంవత్సరంలో డాక్టర్ బి సుబ్రహ్మణ్యం 3 లక్షల రూపాయలను ఐ ఎం ఎకు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తంపై బ్యాంకులో వచ్చిన 27వేల రూపాయల వడ్డీతో ప్రతి యేడాది ఉత్తమ డాక్టర్లకు అవార్డు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే ఇప్పటి వరకు ఆ అవార్డులు కేటాయించలేకపోయినా ఐఎంఎ అధ్యక్షురాలుగా డాక్టర్ కృష్ణప్రశాంతి, కార్యదర్శిగా డాక్టర్ రవిరాజు బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఈ అవార్డు ఇవ్వడంతో వృద్ధులైన డాక్టర్లలో ఎనలేని ఆనందం కనబడింది. కాగా 10 మంది అవార్డుకు ఎంపికైన వృద్ధులైన డాక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరుకాకపోయినప్పటికీ డాక్టర్ కృష్ణ ప్రశాంతి, రవిరాజులు, ఇతర బృందం వారి ఇండ్ల వద్దకే వెళ్లి సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. కాగా అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని డాక్టర్ కృష్ణప్రశాంతి మాట్లాడుతూ ఏ రంగంలోనైనా విద్యార్థికి పుస్తక విజ్ఞానం అవసరమన్నారు. అయితే అంతకుమించి ఆ రంగంలో ముందు పనిచేసిన వారి అనుభవాలు, సదరు విద్యార్థి ఉన్నత శిఖరాలు అందుకోవడానికే కాకుండా వృత్తికి సార్థకత చేకూర్చడానికి పూలబాట వేస్తుందన్నారు. తాను ఈ సభాముఖంగా చెప్పేదేమిటంటే నేటి యువతరమైన విద్యార్థులు పాతతరం వైద్యుల అనుభవాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక వైద్య రంగంలో ప్రతి వైద్యుడూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. అందులో ప్రధానంగా ఒక రోగికి వైద్యం చేసేటపుడు ఏదైనా ప్రమాదం జరిగితే అది పూర్తిగా వైద్యుడిదే బాధ్యత అన్న వైఖరి పెరిగిపోయిందన్నారు. ఏ వైద్యుడు కూడా తన వద్ద చికిత్స చేసుకుంటున్న రోగి ప్రాణం పోగొట్టాలని ప్రయత్నించడనే సత్యాన్ని నేటి సమాజంలో ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు డాక్టర్లు కూడా భయాందోళనలకు గురికాకుండా ఐక్యతగా వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇది జరగాలి అంటే డాక్టర్ల మధ్య ఐక్యత పెరగాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానన్నారు. ఇక డాక్టర్ కొండారెడ్డి ఇప్పటికీ అనేక స్వచ్ఛంద సంస్థలైన సత్యసాయి సేవాసమితి, జగన్మాత చర్చి , మధర్‌థెరిస్సా హోం, శ్రీ కాళహస్తిలోని సుఖబ్రహ్మాశ్రమంలో పేదలకు ఉచిత వైద్యసేవలు అందించడం ఆయన మానవతావాదానికి అద్దంపడుతుందన్నారు. అలాంటి వ్యక్తిని గౌరవించి సన్మానించడం ఐ ఎం ఎ తిరుపతి శాఖకు దక్కిన అదృష్టమన్నారు. సన్మానంతో వృద్ధులైన వైద్యులకు కొత్తగా దక్కే గౌరవం ఏమి లేదని, భవిష్యత్ తరాలకు సీనియర్లను గౌరవించాలనే ఒక గొప్ప సారాంశాన్ని అందించడమే ఈ సన్మాన సంకల్పమన్నారు. డాక్టర్ జి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ
తోటి మనుషులకు సహాయం చేయాలన్నదే అన్ని మతాల సారాంశమన్నారు. వాటిని పాటించడం మనంధరి ధర్మం అన్నారు. ముఖ్యంగా వైద్యులను ప్రజలు ఒక భగవంతుడిగా భావిస్తారని, వారి పట్ల ఎంతోప్రేమ పూర్వకంగా వ్యవహరిస్తే వారు మరింత త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారన్నది అక్షరసత్యం అన్నారు. ఇక ఈ అవార్డును తనచేతుల మీదుగా ఇప్పిస్తున్న ఐ ఎం ఎ అధ్యక్షురాలు డాక్టర్ కృష్ణప్రశాంతి, డాక్టర్ రవిరాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పలువురు సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఈ కాలంలో కూడా వయస్సు మళ్లిన వైద్యులను గుర్తించుకొని సన్మానిస్తున్న ఐ ఎం ఎ కార్యవర్గానికి ఆ భగవంతుడి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని తాము ప్రార్థిస్తున్నామన్నారు. ముఖ్యంగా డాక్టర్ కృష్ణప్రశాంతికి తమ ఆశీస్సులు అందజేస్తున్నామన్నారు. కాగా 70 సంవత్సరాలు పైబడిన సీనియర్ వైద్యులు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ జి.రామ్మోహన్ రావు, డాక్టర్ కె. రాజేశ్వరి, డాక్టర్ కె. సుగుణ, డాక్టర్ ఎం. నజీరుద్దీన్, డాక్టర్ ఎ.కె విజయలక్ష్మి, డాక్టర్ పి.సుభాష్‌లతో పాటు పలువురు డాక్టర్లున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ దుగ్గుమాటి శ్రీహరి, డాక్టర్ ఆశాలత తదితరులు పాల్గొన్నారు.