చిత్తూరు

నేడు మహాశివరాత్రి ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి: నాలుగు యుగాలుగా భక్తుల చేత పూజలందుకుంటున్న శ్రీకాళహస్తీశ్వర స్వామికి సోమవారం మహాశివరాత్రి మహోత్సవం జరగనుంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలకగా హాలాహలం రావడంతో శివుడు దాన్ని సేవించి ఆ విష ప్రభావం వల్ల మగత నిద్రలోకి జారుకుంటాడు. ఆయనను నిద్రపోనివ్వకుండా దేవతలు, రాక్షసులు జాగరణ చేస్తారు. దీనినే మహాశివరాత్రి ఉత్సవం అంటారు. మూగ జీవులైన సాలిపురుగు, పాము, ఏనుగులకు, మూఢ భక్తుడైన కన్నప్పకు మోక్షమిచ్చిన దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. వాటి మూడభక్తికి నిదర్శనంగా పరమశివుడు శ్రీ కాళహస్తీశ్వరుడిగా ఈ క్షేత్రంలో వెలిశాడు. భూర్ణనాభుడు బ్రహ్మచేసే సృష్టికి ప్రతిసృష్టి చేయడం వల్ల బ్రహ్మ ఆగ్రహానికి గురవుతాడు. భూలోకంలోశివున్ని పూజించి మోక్షం పొందుతావని శాపమిచ్చాడు. దీని ప్రకారం భూర్ణనాభుడు భూలోకంలో సాలిపురుగుగా జన్మించి అడవిలో ఉన్న శివలింగానికి పూజలు చేసింది. పరమశివుడు సాలిపురుగును పరీక్షించడానికి అగ్నిని సృష్టించగా సాలిపురుగు అందులో పడి మోక్షం పొందింది. అదేవిధంగా రాక్షసరాజైన కాళంబ ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే శివపూజకు హాజరుకాకుండా ఆయనను తూలనాడేవాడు. దీనిపై కోపించిన కైలాసవాసుడు కాళంబను భూలోకంలో పాముగా జన్మించాలని శపించాడు. ఈశాపంతోకాళంబ పాముగా మారి దక్షణ కైలాసంలోని శివలింగాన్ని రత్నాలు,మణులతో పూజించింది. కైలాసంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో హస్తి అనే సైనికుడు దర్శనం కోసం వెళ్లడానికి ప్రయత్నించాడు. కాపలాగా ఉన్న ప్రమదగణాలు అడ్డుపడినా వారిని తప్పించుకొని హస్తి ఏకాంత మందిరంలోకి వెళ్లాడు.దీంతో కోపించిన పార్వతీదేవి ఆ సైనికుడ్ని మదించిన ఏనుగుగా భూలోకంలో జన్మించాలని శపించింది. శివలింగాన్ని పూజించి మోక్షం పొందాలని శాపవిమోచనం తెలిపింది. దాని ప్రకారం హస్తి ఏనుగుగామారి భూలోకంలో శివలింగాన్ని పూజించేది. తొండంతో స్వర్ణముఖి నది నీటిని తెచ్చి అభిషేకం చేసి తామరపూలతో అలంకరించేది. శివలింగానికి అలంకారం చేయడంలో పాముకు, ఏనుగుకు మధ్య వైరం పెరిగింది. పాముచేసిన అలంకారాన్ని ఏనుగు తొలగించింది. ఏనుగు చేసిన అలంకారిన్ని పాము చెడిపేసేది. ఈ విధంగా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్నారు. శత్రువును మట్టుపెట్టాలని పాము శివలింగానికి అలంకరించిన పూలలో దాక్కుంది. యధాప్రకారం పూజచేయడానికి వచ్చిన ఏనుగుతొండం లోకి పాము దూరడంతో రెండింటికి మధ్య యుద్దం జరిగింది. తొండంలోకి దూరిన పామునుచంపడానికి ఏనుగు కైలాసగిరులను ఢీకొంది. దీంతోరెండూ మృతిచెంది మోక్షం పొందాయి. అదేవిధంగా తిన్నడైన బోయవాడు శివలింగాన్ని పూజించి కన్ను దానంచేసి కన్నప్పగా మారాడు. అటువంటి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఐదోరోజైన సోమవారం మహాశివరాత్రి ఉత్సవం జరగనుంది. శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం మహాశివరాత్రి రావడం విశేషం. దీంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఏర్పాట్లు పూర్తి
మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. చలువ పందిళ్లు వేశారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటుచేశారు. అదనంగా ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటుచేశారు. చిన్నలడ్లు, పెద్దలడ్డు,వడలు,పులిహోరా లాంటి ప్రసాదాలను విక్రయించనున్నారు. ఇందుకోసం ఆలయ కార్యాలయానికి ముందుబాగంలో తాత్కాలికంగా కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఉచిత దర్శనం కల్పించడానికి ధర్మకర్తల మండలిని నిర్ణయించింది. ప్రతియేటా భక్తలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించేవారు. సాధారణ భక్తులు ఒక క్యూలో, ప్రత్యేక టిక్కెట్లు తీసుకున్న భక్తులు మరొక క్యూలో వెళ్లేవారు.అయితే ఈ యేడాది ప్రత్యేక దర్శన టిక్కెట్లు విక్రయించకూడదని నిర్ణయించుకున్నారు. అయితే వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటుచేశారు.
చతుర్వేద పురుషార్థం
వేదాల ప్రకారం ధర్మం,అర్థం,కామం, మోక్షం అనే వాటిని ప్రతి మనిషి సాధించాలని తెలిపారు. అదేవిధంగా శ్రీ కాళహస్తి క్షేత్రంలో కూడా చతుర్వేద పురుషార్థాలకు ఉదాహరణగా ఉంది. అమ్మవారైన జ్ఞాన ప్రసూనాంబ తూర్పుముఖంగా, శ్రీకాళహస్తీశ్వరస్వామి పడమర వైపుగా, పాతాళ గణపతి ఉత్తర ముఖంగా,దక్షిణామూర్తి దక్షిణవైపుగా ఉన్నాడు. చతుర్వేద పురుషార్థాలకు ఉదాహరణగా ఈ క్షేత్రం ఉంది. పురాణాల్లో ఈ క్షేత్రాన్ని దక్షిణకైలాసంగా పిలుస్తారు. పవిత్ర స్వర్ణముఖి నది వడ్డున ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో శివుడుకోసం తపస్సు చేసి అగస్త్య మహర్షికి నదిలేకపోవడం కొరతగా అనిపించి చంద్రగిరికి సమీపంలో ఉన్న తొండవాడ ప్రాంతంలో తపస్సు చేశాడు. ఆయన కోరిక మేరకు పరమశివుడు గంగాదేవిని వినాయకుడి వెంట పంపగా స్వర్ణముఖిగా మారింది. బంగారు రంగులో మెరుస్తూ ఉండటం వల్ల ఈ నదిని స్వర్ణముఖిగా పిలుస్తారు. ఈనదికి రెండువైపులా మొగలిపూల తోటలు ఎక్కువగా ఉండటం వల్ల మొగిలేరు అని కూడా అంటారు. ఎంతో మంది వ్యాధిగ్రస్తులు,రాజులు, దేవతలు, గంధర్వులు ఈ నదిలో స్నానం చేసి పరమశివుడ్ని పూజించి వరాలు పొందిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరం జరుగుతుంది. అయితే స్వర్ణముఖి నదికి మాత్రం ప్రతియేటా పుష్కరం జరుగుతుంది. దక్షిణవైపునుంచి ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి ఈ నదిని గంగానదితో సమానంగా కొలుస్తారు. చంద్రగిరి నుంచి తిరుపతి,శ్రీ కాళహస్తి క్షేత్రాల మీదుగా నెల్లూరు జిల్లాల్లో ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే ఈ పరివాహం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. తాగునీటికోసం కూడా ఈ నీటిని ఉపయోగిస్తారు.

జ్ఞాన ప్రదాత దక్షిణామూర్తి
పరమశివుడు త్రిమూర్తులలో ఒకడని పురాణాలు పేర్కొంటున్నాయి. కేవలం మోక్షం ప్రసాదించడమే కాకుండా అజ్ఞానాన్ని తొలగించే దక్షిణామూర్తిగా కూడా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలో భక్తులు అడుగుపెడుతూనే ముందుగా దక్షిణామూర్తిని దర్శించుకునేవిధంగా ఉంది. రుషులకు ద్వైతం, అద్వైతం అనే అంశంపై వివాదం రావడంతో వివాదాన్ని పరిష్కరించడానికి పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా అవతరించి జ్ఞానాన్ని ప్రసాదించాడు. బాసరలో సరస్వతీ దేవిని పూజించినట్లుగా ఈ క్షేత్రంలో దక్షిణామూర్తిని పూజించడం ఆనవాయితీగా ఉంది. మొదటిసారి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు దక్షిణామూర్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తుంటారు.

నేడే లింగోద్భవం
శ్రీకాళహస్తి, మార్చి 6: అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలకగా వచ్చిన హాలాహలాన్ని సేవించిన కైలాసవాసుడు మగత నిద్రలోకి జారుకోవడాన్ని శివరాత్రి అంటారు. విషం సేవించిన శివుడు నిద్రపోకుండా దేవతలు, రాక్షసులు చేసే జాగరణను శివరాత్రి ఉత్సవంగా నిర్వహిస్తారు. శివుడు తిరిగి మేల్కొనడాన్ని లింగోద్భవం అంటారు. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు అర్చకులు 10 సార్లు అభిషేకాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 3 గంటల తరువాత 11వ అభిషేకాన్ని చేస్తారు. దీనినే లింగోద్భవ కాలమని అంటారు. ఆ సమయంలో స్వామిని దర్శించుకోవడానికి వేలమంది భక్తులు ఎదురుచూస్తుంటారు. లింగోద్భవమూర్తి పేరుతో స్వామివారి ఆలయానికి వెనుకభాగంలో ఒక లింగం ఉంది. దీనిపై మరో కథ కూడా ప్రచారంలో ఉంది. సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే అంశం చర్చకు రావడంతో ఒకరితో ఒకరు వాదించుకుంటారు. ఇద్దరి మధ్య వాదులాట పెరగడంతో శివుడు భారీ లింగంగామారి తన తుది, మొదలును ఎవరు చూస్తారో వారే గొప్పవారని పరీక్షపెట్టాడు. ఆయన మొదటను చూడటానికి విష్ణువువరాహం రూపంలో కిందకు వెళ్లగా, హంస రూపంలో బ్రహ్మ పైకి వెళ్తాడు. అయితే ఎంత వెతికినా మొదలుకనిపించకపోవడంతో మహావిష్ణువు తిరిగి వచ్చి తాను చూడలేకపోయానని ఒప్పుకుంటాడు. అయితే బ్రహ్మ ఎంత వెతికినా చివరిభాగం కనిపించదు. అయితే పై నుంచి కిందకు వస్తుండిన మొగలి పువ్వును, ఆవును బ్రహ్మ సాక్ష్యంగా చెప్పమని వేడుకుంటాడు. ఆయన కోరిక మేరకు అబద్ధం సాక్ష్యం చెప్పడానికి మొగలిపువ్వు, ఆవు అంగీకరిస్తాయి. ఆ ప్రకారం శివుడి తుది రూపం చూశామని మొగలిపువ్వు, ఆవుబ్రహ్మ తరపున సాక్షం చెబుతాయి. చివరకు తప్పును అంగీకరించాయి. దీంతో బ్రహ్మ కూడా తప్పును క్షమించమని కోరుతాడు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకంలో గుడులు ఉండవని శివుడు శాపమిచ్చాడు. అదేవిధంగా బ్రహ్మకు అనుకూలంగా సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వు పూజకు పనికిరాదని, ఆవు ముందుభాగాన్ని పూజకు పనికిరాకుండా శివుడు శాపమిచ్చాడు. మొదలు రూపం చూడలేదని అంగీకరించిన మహావిష్ణువుకు తనతోపాటు సమానంగా పూజలు ఉంటాయని వరమిచ్చాడు. దీనినే లింగోద్భవం అని కూడా అంటారు.
ముద్రగడ తీరును విజ్ఞులైన ప్రజలు గమనిస్తున్నారు
* టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు విమర్శ

ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, మార్చి 6 : ముద్రగడ కాపుల కోసం చేపడుతున్న దీక్ష తప్పా ఒప్పా అన్న ప్రశ్నకు సమాధానంగా విజ్ఞులైన ప్రజలు, మీడియాకు ఆయన చేస్తున్న తప్పేమిటో బాగా తెలుసనని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు అన్నారు. ఆదివారం స్థానిక బ్లిస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూమాట్లాడుతూ కాపుల సంక్షేమంలో ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడ్డం లేదన్నారు. ఇందులో భాగంగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసి అర్హులైన కాపులకు 192 కోట్ల రూపాయల రుణాలను కేటాయించాలని ఏలూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. కాపులను బీసీ జాబితాలో చేరుస్తూనే ఇప్పటికే బీసీలుగా ఉన్నవారికి నష్టం కలగకుండా ముఖ్యమంత్రి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై వస్తున్న వ్యతిరేకతపై ఆయన స్పందిస్తూ ఇందులో ఎస్టీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అమరావతి పేరుతో టీడీపీ నేతలు వందల కోట్ల రూపాయలు భూములను కొనుగోలు చేసి రైతులను మోసం చేశారనే ప్రశ్నకు సమాధానంగా ఇది పూర్తిగా సత్యదూరమని పేర్కొన్నారు. 34 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చారన్నారు. మిగిలిన వారి భూములను రైతులు ప్రైవేటు వ్యక్తులకు విక్రయించి ఉంటే వారు కొనుగోలు చేసి ఉంటారన్నారు. వైఎస్‌ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి అటు తర్వాత వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారని, ఆవిధంగా తమ ప్రభుత్వం చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నీలం బాలాజీ, డాక్టర్ సుధారాణి, నరసింహయాదవ్, మురళి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో...
తిరుమల: తిరుమల శ్రీవారి సేవలో ఏపి టిడిపి అధ్యక్షుడు కళావెంకట్రావు కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం పాల్గొన్నారు. టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకులు మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలుకగా, చైర్మన్ శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేఖరలతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని దేవుని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలని, రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రికి శక్తియుక్తులు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థించానన్నారు.

సమృద్ధిగా వర్షాలతో
రైతులు ఆనందంగా ఉన్నారు
* మంత్రి బొజ్జల వెల్లడి
శ్రీకాళహస్తి, మార్చి 6: శ్రీకాళహస్తీశ్వరస్వామి కృపతో ఈసారి వర్షాలు సంవృద్ధిగా కురిసి రైతులందరూ ఆనందంగా ఉన్నారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలరెడ్డి తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రెండుమూడేళ్లు వర్షాలు లేక రైతులు పూర్తిస్థాయిలో పంటలు పండించలేకపోయారన్నారు. అయితే భగవంతుడు కరుణించి వర్షాలు కురవడం వల్ల స్వర్ణముఖినది పొంగి ప్రవహించిందని అన్నారు. దీనివల్ల అన్ని రకాల పంటలను రైతులు పండిస్తు ఆనందంగా ఉన్నారన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆది దంపతులకు పట్టు వస్త్రాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, ధర్మకర్తల మండలి, ఇ ఒ అన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈకార్యక్రమంలొ ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ గురవయ్యనాయుడు, మున్సిపల్ ఛైర్మన్ రాధారెడ్డి, దేవస్థానం ఇ ఒ భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.

కాపుల సంక్షేమ, అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు
* కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, మార్చి 6: కాపుకులాలను అర్థికంగా అభివృద్ధి చేయడానికి, వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య అన్నారు. స్థానిక రేణుగుంట రోడ్డులోని కృష్ణతేజ విద్యాసంస్థల సమావేశ మందిరంలో ఆదివారం ఆయన కాపుల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ ద్వారా వివిధ రుణాల కొరకు ఆన్‌లైన్ ద్వారా 3,50,000 దరఖాస్తులను స్వీకరించారని, దశలవారీగా అర్హత కలిగిన వారికి రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కాపు, బలిజ, ఒంటరి తెలగ కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రతి సంవత్సరం రూ.100 కోట్లు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వివిధ చేతి వృత్తులపైన ఆధారపడి జీవిస్తున్న కాపు కులస్తుందరి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి తాను కృషి చేస్తున్నానన్నారు.అలాగే బిసిల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని , కాపుల రిజర్వేషన్‌పై కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ జడ్జి మంజునాథ్‌తో కమిటీని కూడా వేయడం జరిగిందని చెప్పారు. రానున్న 8 నెలల్లో కాపు కులస్థులను బిసిల్లో చేర్చడానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా ఈనెల 31వ తేదీ లోగా నూతన రాష్ట్రంలోని కాపు కార్పొరేషన్ ద్వారా 33వేల మందికి వివిధ రుణాలు అందజేయడానికి ప్రణాళికలు అమోదించడం జరిగిందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో కాపు కార్పొరేషన్ ద్వారా 5వేలమందికి వివిధ రుణాల అందజేయడానికి 2015-16 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోకార్పొరేషన్ సభ్యులు నవీన్, మురళి, చదలవాడ సుచరిత, కడప సభ్యులు పెంచలయ్య, జిల్లా బిసి సంక్షేమ సహాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.

కులం పేరుతో కల్లోలం సృష్టించొద్దు
* జగన్ ప్రతిపక్ష నాయకుడిగా వైలఫ్యం : టిటిడి చైర్మన్ చదలవాడ

ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, మార్చి 7 : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచడంతో భాగంగా కాపులను బీసీ జాబితాలో చేర్చడమే కాకుండా బీసీ జాబితాలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతుంటే ముద్రగడ కులం పేరుతో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నించడం ధర్మం కాదని టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి హితవు పలికారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపుల సంక్షేమం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. నిజంగా ముద్రగడకు చిత్తశుద్ధి ఉంటే సంతోషించాలన్నారు. అలాకాకుడా కులం పేరుతో కల్లోలం సృష్టించి రాజ్యసభ సభ్యుడు కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ వెనుక కాపులు లేరని, ఆ విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు. తాను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక సంస్థకు చైర్మన్‌గా పనిచేస్తున్నానని, తాను కూడా కాపు కులస్థుడినేనన్నారు. టిడిపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయిన కళా వెంకటరావుకూడా కాపు కులస్థుడేనన్నారు. ఎంతో మంది కాపు కులస్థులను ఎమ్మెల్యేలను చేసిన ఘనత టీడీపీదేనన్నారు. కాపులకు ద్రోహం ఎక్కడ జరుగుతుందో ముద్రగడ ఆయన వెనుక ఉండి కథ నడిపిస్తున్న జగన్ మోహన్‌రెడ్డి చెప్పాలన్నారు. జగన్ మోహన్‌రెడ్డి అరాచకాన్ని భరించలేక అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న టిడిపి లోకి ఆయన ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారన్నారు. అధికారం కోసం వేచి ఉండాలే తప్ప కల్లోలాలు సృష్టిస్తే ముఖ్యమంత్రి కాలేరన్న సత్యాన్ని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించాలని హితవు పలికారు. ధర్మబద్ధంగా జీవిస్తే భవిష్యత్తు ఉంటుందని లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. చంద్రబాబు నాయుడు పాలనా దక్షతను చూసి ప్రపంచ దేశాలను ఆంధ్రావైపు చూస్తున్నాయన్నారు.
మహిళ హత్యకేసులో
నిందితుడు అరెస్టు
పీలేరు, మార్చి 6: మండల పరిధిలో కంచంవారిపల్లెలో గత రెండు రోజుల క్రితం ఈశ్వరమ్మ (35) దారుణహత్యకు గురైన సంగతి విదితమే. ఈ హత్యకేసులో ఆదివారం అదేగ్రామానికి చెందిన చంద్ర(50)ను అరెస్టు చేసినట్లు పీలేరు రూరల్ సి ఐ మహేశ్వర్, ఎస్ ఐ సురేష్ బాబులు తెలిపారు.
రెండేళ్లలో వెయ్యి అన్నమయ్య సంకీర్తనల రికార్డింగ్
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, మార్చి 6: శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టును పునర్ వ్యవస్థీకరించిన అనంతరం రెండేళ్లలో వెయ్యి అన్నమయ్య సంకీర్తనలు రికార్డింగ్ జరిగేలా కృషిచేస్తున్నామని టిటిడి తిరుపతి జె ఇ ఒ పోలభాస్కర్ వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమయ్య కళామందిరంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య వేదాంత బోధ, అన్నమయ్య వేంకటగిరి వైభవం సిడిలను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు 1990లోప్రారంభమైందని 2013 వరకు 1517 సంకీర్తనలను రికార్డింగ్ చేశామన్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం 2013 సెప్టెంబర్‌లో అత్యాధునిక రికార్డింగ్ పద్దతులను ఏర్పాటు చేసి రికార్డింగ్ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఇప్పటి వరకు 600 సంకీర్తనలను రికార్డు చేశామని మరో 6నెలల్లో 700 సంకీర్తనల రికార్డింగ్ పూర్తి చేస్తామన్నారు. 2016 సెప్టెంబర్ నాటికి 1000 సంకీర్తనలు రికార్డింగ్ పూర్తిచేసి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సహస్ర ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. కాగా అన్నమయ్య వేదాంత బోధ సిడిలను విజయనగరంలోని సంగీత కళాశాల అధ్యాపకులు బి ఎ నారాయణ స్వరపరచగా ఎస్వీ రికార్డింగ్ ప్రత్యేక అధికారి మునిరత్నం రెడ్డి గానం చేశారు. అన్నమయ్య వెంకటగిరి వైభవం సి డి లను అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు మధుసూధన్‌రావు స్వరపరచగా టిటిడి టెక్నికల్ ఆఫీసర్ బాలసుబ్రమణ్యం గానం చేశారు. వీరిని జె ఇ ఒ ఘనంగా సన్మానించారు. అలాగే సి డి ల రూప కల్పనలో ప్రత్యేకంగా కృషి చేసిన ఇంజినీర్లు బి.రామస్వామి, రత్నకుమార్, సతీష్ కుమార్, దామోధర శెట్టిలను కూడా జె ఇ ఒ సత్కరించారు. ఈకార్యక్రమంలో డిప్యూటి ఇ ఒ లంక విజయసారథి, డిప్యూటి ఇ ఒ సారధ, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, కె జె కృష్ణమూర్తి, విమలాకుమారి, సాయిచంద్ర, ఏ పి ఆర్వో నీలిమా తదితరులు పాల్గొన్నారు.
బాబుకు సీమ సత్తా చూపిద్దాం.. కదలిరండి
* రామానాయుడు పిలుపు
తిరుపతి, మార్చి 6: రాయలసీమ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న సి ఎం చంద్రబాబు నాయుడుకి సీమ సత్తా ఏమిటో రుచి చూపించడానికి ఈనెల 15న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు పిలుపునిచ్చారు. స్థానిక బైరాగిపట్టెడలోని సి పి ఐ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను సీమ బిడ్డనని చెప్పుకుంటున్న సి ఎం సీమప్రజలకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం వామపక్షాలు చేపట్టిన బస్సు యాత్రకు అపూర్వ స్పందన వచ్చిందని చెప్పారు. అలాగే చలో అసెంబ్లీ కార్యక్రమంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈకార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, నాయకులు మురళి, శ్రీరాములు, జయలక్ష్మి, శోభరాణి, రత్నమ్మ, మంజుల పాల్గొన్నారు.
సదాశివకోన వద్ద బస్సు ఢీకొని మహిళ మృతి
పుత్తూరు, మార్చి 6: సదాశివ కోనకు వెళ్లి ద్విచక్రవాహనంలో తిరిగి వస్తున్న కంచికి చెందిన భార్యాభర్తలను బస్సు ఢీకొనడంతో లోకనాయకి ( 30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం నాడు జరిగింది. వివారాలిలా ఉన్నాయి. కంచికి చెందిన కరుణ (38) తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం సదాశివకోనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోనవద్ద ఉన్న బస్టాండులో బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో కరుణ నడుపుతున్న ద్విచక్రవాహనం బస్సును ఢీకొంది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనం వెనుక కూర్చుని ఉన్న లోకనాయకి బస్సు వెనుక టైరు కింద పడింది. దీంతో తలకు తీవ్రగాయాలై ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.