చిత్తూరు

15 రోజులకు సరిపడా సరుకులు నిల్వ ఉంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 4: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాల తయారీ, ఇతర టిటిడి అవసరాలకు సంబంధించి బియ్యం, పప్పుదినుసులు, జీడిపప్పు తదితర సరుకులను 15 రోజులకు సరిపడా నిల్వ ఉంచుకోవాలని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ వారపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇఓ మాట్లాడుతూ మార్కెటింగ్ విభాగం ఆధ్వర్యంలో ఒక నెలలోపు కోల్డ్ స్టోరేజిని సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీవారి వెండి, రాగి డాలర్లను వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులను, మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలన్నారు. ఆయా జిల్లాల్లో గల టిటిడి కల్యాణ మండపాల్లో మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. పంచలోహ, రాతి విగ్రహాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే అందించాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పద్మ అవార్డు గ్రహీతల వివరాలు సేకరించి మరింత మెరుగ్గా నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలు ఏర్పాటుచేయాలని ఎస్వీబీసీ సిఇఓ ఎ.వి నరసింహారావును ఇఓ ఆదేశించారు. తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం కాంప్లెక్సుల్లో గీజర్లు, ఎలక్ట్రికల్ స్టెబిలైజర్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ల మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఉద్యోగ విరమణ చెందిన వారికి త్వరగా సెటిల్‌మెంట్ చేయాలని సిఎఓ రవిప్రసాద్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఇఓ పోల భాస్కర్, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వరరావు, న్యాయాధికారి వెంకటరమణ, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో బాలాజి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.