చిత్తూరు

హైవేలో భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం, జూలై 8: రోడ్డు విస్తరణలో భాగంగా భూములను కోల్పోయే రైతులకు న్యాయం చేస్తామని మదనపల్లి సబ్‌కలెక్టర్ కృతికాబత్ర పేర్కొన్నారు. శుక్రవారం మండల కార్యాలయంలో హైవే భూములు కోల్పోయే రైతులతో సమావేశమై మాట్లాడుతూ ఎన్‌హెచ్ 219విస్తరణలో భూములను కోల్పోయే రైతులకు హంద్రీ-నీవా సుజల స్రవంతి భూముల పరిహారం ఎంత చెల్లిస్తున్నామొ అదేవిధంగా ఎకరాకు ఆరు లక్షల 50వేల వంతున చెల్లిస్తామన్నారు. మండల పార్టీలోని సొనే్నగానిపల్లి, నాయనిపల్లి, డొంకుమానపల్లి, తుమ్మిసి, కడపల్లి, పోడూరు రెవెన్యూ గ్రామాల పరిధిలోని సుమారు 5.73సెంట్ల భూమిని రోడ్డు వెడల్పునకు స్వీకరిస్తామన్నారు. సుమారు 35మంది రైతులకు చెందిన భూములు విస్తరణలో కోల్పోతున్నారని అన్నారు. రైతులు ఎక్కడ అభ్యంతరాలు తెలపకుండా భూములను అప్పగించి రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ కల్పనకుమారి, సిడిసిఎంఎస్ చైర్మన్ శ్యాంరాజు తదితరులు పాల్గొన్నారు.