చిత్తూరు

మంత్రిగారికి ఆగ్రహం ఎందుకో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 12: రేణిగుంట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు సక్రమంగా విధులకు హాజరుకావడంలేదని, వచ్చిన పేషంట్లతో గౌరవంగా వ్యవహరించడం లేదని రేణిగుంట జడ్పిటిసి లీలావతి రాష్ట్ర వైద్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేయగా ఆయన తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రేణిగుంట మండలంలో కోటి 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిందలచిన భవనం శంకుస్థాపన సందర్భంగా సభలో ఈ సంఘటన చోటుచేసుకుంది.అనంతరం ఈ అంశంపై కొంత మంది విలేఖరులు జడ్పిటిసి లీలావతిని ఈ సంఘటనపై స్పందన అడిగారు. ముందుగా ఆమె చెప్పడానికి నిరాకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ పేదలకు మేలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే దానిని అధికారులు పాటించడం లేదని మంత్రికి చెప్పానని, అయితే ఎందుకో ఆయన తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మహిళా ప్రతినిధులకు ఇచ్చే మర్యాద ఇదేనా
తన పరిధిలో జరుగుతున్న తప్పులను మంత్రి దృష్టికి తీసుకొచ్చినపుడు వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన మంత్రి కామినేని ఫిర్యాదుచేసిన ఒక మహిళా జడ్పిటిసి లీలావతిపై ఆగ్రహం వ్యక్తం చేయడం సబబుకాదని మండల సిపిఎం కార్యదర్శి ఓవి రమణ విమర్శించారు. బిజెపి, టిడిపి మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో డాక్లర్లు పేదల పట్ల తీసుకున్న నిర్లక్ష్య వైఖరిని ఒక మహిళా ప్రతినిధి మంత్రి దృష్టికి తీసుకెళ్లినపుడు అభినందించాలన్నారు. అలాంటిది మంత్రి కామినేని ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, దురుసుగా మైకును విసిరివేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా తీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులకు నిజాలు చెబితే జీర్ణించుకోలేరని ఈ సంఘటనతో తేటతెల్లమైందన్నారు. తాము పేద ప్రజల సమస్యల పట్ల పోరాడుతామని హెచ్చరించారు.