చిత్తూరు

బాబు, కెసిఆర్ ములాఖత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులు తమ స్వార్థ రాజకీయ స్వలాభాల కోసం ప్రజాసమస్యలను తాకట్టుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారని, ఈ విషయాన్ని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన చట్టంలో ఇరురాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చట్టాలను రూపొందించిందన్నారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ప్రజలకు కూడా నష్టపోకూడదన్నది కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. అయితే ఇటు కెసి ఆర్, అటు చంద్రబాబునాయుడు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడి ఎక్కడ వేలెత్తిచూపిస్తే శిక్ష అనుభవించాల్సి వస్తుందేమోనన్న భయంతో తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారన్నారు. ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన చంద్రబాబు, అలాగే ఫోన్ ట్యాపింగ్‌లో పట్టుబడిన కెసి ఆర్ కేసులు లేకుండా మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ అక్కడ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణమేంటని ఒక విలేఖరి ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడు గడ్డు పరిస్థితులు వచ్చినా అవి గాలి బుడగల్లా తేలిపోయేవేనని, అవి తమ పార్టీ సుదీర్ఘచరిత్రలో ఎన్నో పర్యాయాలు నిరూపితమయ్యాయన్నారు. గత ఎన్నికల్లో కెసి ఆర్, చంద్రబాబులు అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారన్నారు. అధికారంలోకి వస్తే ఏదో చేస్తారులే అని ప్రజలు నమ్మి గెలిపించారన్నారు. రెండేళ్లుకూడా తిరగకముందే ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల డొల్లతనం బయట పడిందని, ఈ విషయాన్ని ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారన్నారు. ఇక తాము ప్రజల్లోకి వెళ్లి వీరి తప్పిదాలన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదని, భవిష్యత్‌లో ప్రజలే వీరికి బుద్ధిచెప్పడం ఖాయమని అన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యమంటారా ? అన్న ప్రశ్నకు ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పడం కన్నా నాయకులు చిత్తశుద్ధిలేని తనమని స్పష్టంగా చెప్పగలనన్నారు. ఉన్న విషయాన్ని చెప్పడానికి తానెవరికీ భయపడాల్సిన అవసరం ఉండదని మరోప్రశ్నకు సమాధానం చెప్పారు. తెలుగు భాష పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలను చేపట్టిందని, అయితే వాటిని నేటి ప్రభుత్వాలు గాలి కొదిలేశాయని ఆరోపించారు. వీటిని ప్రభుత్వాలు పునః సమీక్షించుకొని అమలుచేయమని తాను కోరుతున్నానన్నారు. ఇరు రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని , ఇరు రాష్ట్రాలు అభివృద్థి పథంలో నడవాలని తాను ఆ భగవంతుడ్ని ప్రార్థించామన్నారు.