చిత్తూరు

ఇసుక అక్రమ రవాణను కట్టడి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 26: ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు కఠినంగా వ్యహరించాలని రాయలసీయ ఐజి వేణుగోపాల కృష్ణ ఆదేశించారు.శనివారం చిత్తూరు పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుకను ప్రభుత్వం ఉచితం చేసిన నేపధ్యంలో అక్రమంగా తరలిపోయే ప్రమాదం ఉందని దీన్ని పోలీసులు పూర్తిగా నియంత్రించాలన్నారు. ఇందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుకను నిర్ధేశించిన ప్రాంతాలోనే సేకరించాలని అలాకాక ఎక్కడ బడితే అక్కడ ఇసుకను తవ్వడం నేరమమన్నారు. ఇలాంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలన్నారు.జెసిబిలతో ఇసుకను తీయరాదని అలా జరిగితే వెంటనే సంఘటాస్థలానికి వెళ్లి జెసిబిలను సీజ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది తమకు పరిధిలోని ఇసుక రీచ్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక వ్యవహరంలో చాలా కఠినంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఇటు కర్నాటకా అటు తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటంతో ఇసుక జిల్లా సరిహద్దులు దాటకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు. ఇసుకకు ఎక్కడా డబ్బులు వసూళ్లు చేయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గృహ తదితర అవసరాలకే ఇసుకను వినియోగించే విధంగా చూడాలన్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం కాని, ఎక్కువ మోతాదులో నిల్వ ఉంచుకోవడం కూడా చట్టప్రకారం నేరమన్న విషయాన్ని ప్రజలకు తెలపాలని చెప్పారు. ఇసుకను అక్రమంగా తరిస్తే కఠిన చర్యలు తీసుకొనే విధంగా పోలసులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సరిహద్దులో నిఘా పెంచాలని ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ , ఏ ఎస్పీ అభిషేక్ మహంతి, పలువురు డిఎస్పీలు సిఐలు ఇతర పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.

ఎగ్‌రైస్ తిని పది మందికి అస్వస్తత
* నలుగురి పరిస్థితి విషమం

కుప్పం, మార్చి 26: మండల కేంద్రమైన గుడుపల్లెలోని రైల్వేక్రాస్ వద్ద బండ్లపై తయారు చేసే ఎగ్‌రైస్‌ను తిని పదిమంది తీవ్ర అస్వస్థకు గురైన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గత ఏడాది కాలంగా ఇక్కడ బండ్లపై ఎగ్‌రైస్, చికెన్‌రైస్ తయారు చేసి విక్రయించేవారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అక్కడ తయారైన ఎగ్‌రైస్‌ను తిన్న పది మంది తీవ్ర అస్వస్తకు గురైయ్యారు. శరీరమంతా బొబ్బళ్లతో పాటు మొఖం వాచిపోవడంతో వెంటనే స్థానికులు గమనించి కుప్పం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని ఐసియులో ఉంచి ప్రత్యేక చికిత్సలు నిర్వహిస్తున్నారు. దీనికి కారణం కలుషిత ఆహారమేనని గుర్తించారు. ఈ ఆహారం తిన్న కేవలం అర్ధగంట వ్యవధిలోనే వీరందరూ అస్వస్తకు గురికావడం గమనార్హం.