చిత్తూరు

భక్తుల సౌకర్యార్థం అదనంగా 2వేలు లగేజి, పాదరక్షల డిపాజిట్ ర్యాక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 17: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం మొత్తం 2వేల ర్యాక్‌లతో అదనంగా లగేజి, పాదరక్షల డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటుచేయాలని టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో ఆదివారం ఇ ఓ కల్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, పి ఏసి -4, తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇ ఓ మాట్లాడుతూ కల్యాణ కట్ట, పి ఎసి-4 వద్ద లగేజి, పాదరక్షలను డిపాజిట్ చేసి, తిరిగి తీసుకునేందుకు వీలుగా అదనంగా కౌంటర్లు ఏర్పాటుచేయాలన్నారు. రోడ్లపక్కన పేరుకుపోయిన పాదరక్షలు, ఇతర వ్యర్థ పదార్థాలు క్రమం తప్పకుండా తొలగించాలని సూచించారు. కల్యాణకట్టలో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా మరిన్ని టోకెన్ మంజూరు కేంద్రాలు, భక్తులు సులభంగా గుర్తించేలా సూచికబోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న గదులను ఈ నెలాఖరుకు పూర్తిచేసి కల్యాణకట్టను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. పి ఎసి-4ను మరింతగా ఆధునీకరించాలన్నారు. పాదరక్షల దొంగలపై నిఘా పెంచాలని విజిలెన్స్ అధికారులకు ఇ ఓ ఆదేశించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 వద్ద దివ్యదర్శనం భక్తుల కోసం నిర్మిస్తున్న నూతన కాంప్లెక్స్ పనులను ఇ ఓ పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనక కాంప్లెక్స్‌లో అందుతున్న సౌకర్యాలను భక్తులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్టక్రు చెందిన పలువురు భక్తులు సౌకర్యాలు బాగున్నాయని ఇ ఓ కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి సేవలో యువత సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. ఎన్ సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను మరింత ఎక్కువగా వినియోగించుకోవాలన్నారు. శ్రీవారి సేవకులకు ఆయా విభాగాలకు సంబంధించి పూర్తిస్థాయిలో శక్షణ ఇవ్వడం ద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న ఇసుపసామగ్రిని సేకరించి వేలం వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇ ఓ వెంట టిటిడి ఎస్ ఇ -2 రామచంద్రారెడ్డి, కల్యాణ కట్ట డెప్యూటీ ఇ ఓ బేబి సరోజిని, అన్నప్రసాదం ట్రస్టు ప్రత్యేకాదికారి చెంచులక్ష్మి, ముఖ్య భద్రతాధికారి రవీంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట ఇతర అధికారులు పాల్గొన్నారు.