చిత్తూరు

రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, జూలై 17: వ్యవసాయం చేసే రైతులకు అన్ని విధాలా సహాయపడతామని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదివారం హామీ ఇచ్చారు. ఆదివారం తొట్టంబేడు మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ వరి పంటేకాకుండా ఇతర పంటలను కూడా పండించాలని రైతులకు సూచించారు. వ్యవసాయానికి సంబంధించిన యంత్రసామగ్రి, పనిముట్లను ప్రభుత్వం ద్వారా అందజేస్తామన్నారు. రైతుల అభివృద్ధి కోసం కృషిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తొట్టంబేడు మండలంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అత్యధిక మెజార్టీ మండల ప్రజలు అందించారని కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కవ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మండల కేంద్రమైన తొట్టంబేడులో నిర్మించిన వెలుగు కార్యాలయం భవనాన్ని ప్రారంభించారు. ఐ సి డి ఎస్ కార్యాలయానికి శంఖుస్థాపన చేశారు. మండలంలోని గోనిపల్లె గ్రామంలో వేసిన మంచినీటి పైపులైన్‌ను ప్రారంభించారు. తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పోలమ్మ, శ్రీ కాళహస్తి దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షుడు గురవయ్యనాయుడు, మంత్రి సతీమణి బృందమ్మ, శ్రీ కాళహస్తి, తొట్టంబేడు మార్కెట్ కమిటీ ఛైర్మన్లు చెంచయ్యనాయుడు, రామాంజులు నాయుడు, పార్టీ నాయకులు మురళీనాయుడు, ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.