చిత్తూరు

అధికారుల నిర్లక్ష్యం ఖరీదు రూ.అర కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూలై 17 : మదనపల్లె మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెత్తను తరలించే వాహనాలు మూలనపడి తుప్పుపడుతూ ఎందుకూ పనికిరాని దుస్థితిలో ఉన్నాయి. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణంలోని 35 వార్డులలో 2.40 లక్షల మంది జనాభా ఉన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య శాఖ పట్టణంలోని చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ట్రాక్టర్లు, మినీ జెసిబి, రిక్షాలు, ఐషర్ వాహనాలు, జెసిఎంలు, ఆటోరిక్షాలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతిఏటా సాలీడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ పథకం ద్వారా లక్షలాది రూపాయలు మున్సిపాలిటీకి విడుదల చేస్తోంది. ఈ నిధులతో కొనుగోలు చేసిన ఐషర్ వాహనాలు, ట్రాక్టర్లు, తొట్టెలు, ఆటోరిక్షాలు, ట్రాలీలు అరకొర మరమ్మతులకు గురైతే వాటిని అప్పటికప్పుడే బాగు చేయించుకుని పనులు చేసేవారు. ట్రాక్టర్ ఇంజన్ సమస్య ఎదురైతే స్పేర్‌పార్ట్ కొనుగోలు చేసి మరమ్మతులు చేస్తే ఆ ట్రాక్టర్ యధావిధిగా నడుస్తుంది. అలాకాకుండా మదనపల్లి మున్సిపాలిటీ ట్రాక్టర్లు మరమ్మతుల పేరుతో పూర్తిగా పనిచేయని విధంగా అధికారులు రికార్డుల్లో లెక్కలు చూపుతూ వాటిని మూలన పడేశారు. ఈ ట్రాక్టర్లు, తొట్టెలు, గత ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన రిక్షాలు ఆరుమాసాలకే మూలనపడగా, మూడేళ్ల క్రితం కొనుగోలు చేసిన ఆటోరిక్షాల పరిరక్షణ గాలికొదిలేశారు. వీటి పర్యవేక్షణ కరువై పనులు పూర్తిచేసిన అనంతరం ఎక్కడపడితే అక్కడే వదిలేస్తున్నారు. దీంతో ఎండకు ఎండి, వానకు తడిచి తుప్పు పడుతున్నా, కనీసం వీటి పర్యవేక్షణ కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. 2009 మే మాసంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద అదనంగా నాలుగు ట్రాక్టర్‌ల ఇంజన్లను కొనుగోలు చేశారు. ఆ నాలుగు ట్రాక్టర్లు సైతం నిత్యం మరమ్మతుల పేరుతో నిలిచిపోయాయి. చెత్త సేకరణకు రిక్షాలు కొనుగోలు చేయగా, ఇవి కార్మికుడి శ్రమతో కూడి ఉండటంతో వాటికి తోడుగా చెత్తను తరలించేందుకు మూడేళ్ల క్రితం 12 లక్షల వ్యయంతో తొమ్మిది ఆటోలు, మళ్లీ చెత్తను తరలించేందుకు ట్రాక్టర్ స్థానంలో పాతిక లక్షల రూపాయల వ్యయంతో 2 డిసిఎం మినీ లారీలు కొనుగోలు చేశారు. 2009లో 24 లక్షలతో కొనుగోలు చేసిన నాలుగు ట్రాక్టర్లను బాగు చేసి ఉపయోగిస్తే ప్రస్తుతం ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించకుండా కొంతమేరకు నివారించవచ్చు. ప్రస్తుతం తిరుగుతున్న ఆటోలు ప్రధాన చిన్న రహదారులు మినహా చిన్నచిన్న సందుల్లోకి వెళ్లలేకపోవడం, 2008లో తొమ్మిది రిక్షాలు, 2009లో 24 రిక్షాలు, 2010లో 30 రిక్షాలు వెరసి 6 లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారు. ఈ రిక్షాలు సుమారు మదనపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో 62 రిక్షాలు అక్కడక్కడ పడిపోయి తుప్పు పడుతున్నాయి. రిక్షాలకు పంచర్లకు 5 నుంచి 10 రూపాయలు కూడా ఖర్చు చేయలేని పరిస్థితికి మున్సిపల్ పారిశుద్ధ్య శాఖ పనితీరుపై మూలన పడివున్న రిక్షాలే ఇందుకు నిదర్శనం. పట్టణంలో జంతువధశాల, రామారావుకాలనీ, గొల్లపల్లి దళితవాడ, నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లేఔట్, దేవళంవీధి, రాటకొండ రెడ్డెప్పనాయుడుకాలనీ తదితర ప్రాంతాల్లో ఈ రిక్షాలు మరమ్మతులకు గురై అక్కడక్కడ పడి ఉన్నాయి. 2008లో రిక్షాల ద్వారా ఇంటింటా చెత్తను సేకరించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఆదిలోనే హంసపాదుగా నిలిచిపోయింది. మూలపడిన ట్రాక్టర్లు, మినీ జెసిబి, ఐషర్ వాహనం, మూడు ట్రాక్టర్లు, మూడు ట్రాక్టర్ తొట్టెలు, రెండు ట్యాంకర్లు, ట్రాలీలు, రిక్షాలు సైతం వేలం ద్వారా విక్రయిస్తే 50 లక్షల రూపాయలు మున్సిపల్ ఖజానాకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మరమ్మతుల పేరుతో మూలన పడి ఉన్న వాహనాలను వేలం ద్వారా విక్రయించి అయినా కొంతమేరకు ఆదా చేసుకోవాలని కోరుతున్నారు.