చిత్తూరు

మూడవ విడత భగవత్ రామానుజుల సంచార రథం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 19: ప్రసిద్ధ శ్రీ వైష్ణవాచార్యులు భగవద్ రామానుజులవారి సహస్రాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మూడవ విడత సంచారరథం తిరుపతి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా 8 దివ్యదేశాలలో సంచార రథం పర్యటించనుంది. మే 10వ తేదీన తిరుమలలో సంచార రథం ప్రారంభించిన విషయం విదితమే. ఈ రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు, శ్రీరామానుజుల వారి విగ్రహం ఉంటాయి. ఈనెల 19వ తేదీ మంగళవారం ఉదయం 6.30 గంటలకు తిరుపతి నుంచి సంచార రథం బయలుదేరి ఉదయం 10 గంటలకు తమిళనాడు రాష్ట్రం వేలూరు, మధ్యాహ్నం 1 గంటలకు సేలం, రాత్రి 8.30 గంటలకు మధురై చేరుకుంటుంది. ఈనెల 20వ తేదీ ఉదయం 6 గంటలకు మధురై నుంచి బయలుదేరి తిరుకోస్తియూర్ ( దివ్యదేశం), ఉదయం 9.30 గంటలకు తిరుమణ్యం (దివ్యదేశం)లను సందర్శించి మధ్యాహ్నం 1 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు రామనాథపురంలో శోభాయాత్ర, ప్రముఖ పండితులతో ఆధ్యాత్మిక ప్రవచనాలు, స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 22వ తేదీ ఉదయం 6 గంటలకు రామనాథపురం నుంచి బయలుదేరి ఉదయం 7 గంటలకు తిరుప్పుల్లవి (దివ్యదేశం), ఉదయం 8.30 గంటలకు తిరుతంగల్ (దివ్యదేశం) ఉదయం 11.30 గంటలకు రాచపాళ్యం చేరుకుటుంది. సాయంత్రం రాచపాళ్యంలో శోభాయాత్ర, ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 23వ తేదీ ఉదయం 7 గంటలకు రాచపాళ్యం నుంచి బయలుదేరి శ్రీ విల్లీపుత్తూరుకు చేరుకుంటుంది. ఉదయం 11 గంటలకు శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 24వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీవిల్లిపుత్తూరు నుంచి బయలుదేరి ఉదయం 9.30 గంటలకు తిరుమోగియూరు ( దివ్యదేశం), ఉదయం 11.30 గంటలకు అలగార్‌కోయిల్ ( దివ్యదేశం) లను సందర్శిస్తారు. రాత్రి 9 గంటలకు సేలం చేరుకుంటారు. ఈనెల 25వ తేదీ ఉదయం 6 గంటలకు సేలం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. కావున భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారు, అమ్మవార్ల దర్శనం చేసుకోవాల్సిందిగా కోరారు.