చిత్తూరు

బరితెగిస్తున్న ఎర్రకూలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 21: చట్టాలను కఠినతరం చేసినా ఎర్రకూలీలు మాత్రం ఏమాత్రం వెనకంజ వేయకుండా అడవుల్లో ఎర్రచందనం చెట్లను కొట్టడానికి తరలి వస్తున్నారు. కూలీలుగా వస్తున్నవారిలో ఎక్కువ శాతం ఎర్రకూలీలు ఉండటం చట్టాలు కఠిన తరం చేసిన అంశం వారికి అవగాహన లేకపోవడంతో వస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో గురువారం తెల్లవారుజామున కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ఎర్రకూలీలు రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో కానిస్టేబుల్ దిలీప్‌కుమార్ గాయపడ్డాడు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకాల్పులు జరిపారు. ఈనేపథ్యంలో ఎర్రచందనం చెట్ల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టాలపై తాజాగా తీసుకున్న నిర్ణయాలను, పట్టుబడితే విధించే కఠినచర్యలపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఆయా మాతృభాషల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పలువురు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎర్రకూలీలు ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తున్నారో ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేయాలన్నది పలువురి సలహా. కాగా చట్టాలను కఠినతరం అయ్యేకొద్ది స్మగ్లర్లు వారికి పెద్ద మొత్తంలోడబ్బులు ఆశ చూపుతుండడంతో కూలీలు ప్రాణాలకు తెగించి ఎర్రచందనం చెట్లను కొట్టడానికి వస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు, అటవీశాఖాధికారులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా పోలీసులకు, అటవీశాఖాధికారులకు అధునాతన ఆయుధాలను కూడా అందించాల్సిన అవసరం ఉంది. కాగా ఇటీవల తిరుపతిలో ఎర్రచందనం అటవీ పరిరక్షణపై జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలోకలెక్టర్ సిద్ధార్థజైన్ సూచించినట్లు డ్రోన్‌లను వినియోగించుకోవాల్సిన అవసరం ఆసన్నమైనట్లు కనబడుతోంది. పోలీసులపై ఎర్రదొంగలు దాడి
భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రాంతంలో...
చిన్నగొట్టిగల్లు: భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రాంతంలో పోలీసులపై ఎర్రస్మగ్లర్లు జరిపిన దాడిలో ఓ పోలీస్‌కు గాయాలు కాగా తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు పీలేరు రూరల్ సిఐ మహేష్ స్థానిక విలేఖర్లకు తెలిపారు. సిఐ మహేష్ కథనం మేరకు వివరాలిలా వున్నాయి. గురువారం తెల్లవారు జామున పోలీస్, టాస్క్ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా పుట్టగడ్డ ప్రాంతంలో సుమారు 20మంది ఎర్రచందనాన్ని మోసుకొస్తూ కనిపించారు. అయితే వీరిని లొంగిపోవాలని హెచ్చరించగా రాళ్ళు, గొడళ్ళతో ఎదురుదాడికి దిగారని, ఈ ఎదురు దాడిలో పోలీస్‌లకు గాయాలు కావడంతో గాలిలోకి కాల్పులు జరుపగా ఎర్రదుంగలను వదిలి పారిపోవాలని ప్రయత్నించిన వారిలో తమిళనాడుకు చెందిన స్వామినాథన్, సంతాప్‌లను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వదిలిన రూ.5లక్షలు విలువ చేసే 300 కిలోల బరువుగల 9దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో టాస్క్‌పోర్స్ ఎస్‌ఐ ఆశోక్‌కుమార్, ఆర్‌ఎస్‌ఐ భాస్కర్, ఎస్‌ఎస్‌వో వెంకటసుబ్బయ్య, ఫారెస్ట్ బీట్ ఆఫిసర్ శ్రీరాములు, సిబ్బంది పాల్గొన్నారు.