చిత్తూరు

స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 24: తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ముందకు సాగుతోందని, ఇందులో అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపారులు కూడా భాగస్వాములు కావాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రామతులసి కల్యాణ మండలంలో చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సర్వసభ్యసమావేశం జరిగింది. కామర్స్ అధ్యక్షుడు మంజునాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 42 మంది వ్యాపారస్తులు రక్తదానం చేశారు. ప్రసూతి ఆస్పత్రిలో అత్యవసరంగా రక్తం అవసరమైన ప్రసూతి మహిళలకు వినియోగార్థం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశామని మంజునాథ్ తెలిపారు. అనంతరం జరిగిన సభలోమంత్రి బొజ్జల, ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి నగరంలోని వ్యాపారస్తులు కేవలం వ్యాపారాలకే పరిమితం కాకుండా సమాజిక సేవల్లో కూడా భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. వ్యాపారస్తుల న్యాయపరమైన సమస్యల పరిష్కరించడంకోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైల్వేస్టేషన్‌నుంచి ఎస్వీయూ, స్విమ్స్, రుయా ఆసుపత్రిమీదుగా అలిపిరి వరకు బైపాస్‌రోడ్డు నిర్మించే అంశం ప్రభుత్వ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. మంజునాథ్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి వెస్ట్ రైల్వేస్టేషన్ నుంచి బైపాస్ రోడ్డు వేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనానికి స్థలం కేటాయించేందుకు సహకరించాలని ఆయన మంత్రిని కోరారు. తిరుపతిలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆయన సమావేశంలో తీసుకున్న తీర్మానాలను వివరించారు. వాణిజ్య పన్ను చట్టంలోని కాన్ఫిస్కేషన్ నిబంధన రద్దుచేయాలని, 25వేల రూపాయల వరకు ఆన్‌లైన్‌లో వే బిల్లులు లేకుండా చట్టాన్ని సవరించాలని, వాహనాల తనిఖీల సమయంలో వాహనాన్ని నిలపలేదనే మిషతో లక్ష రూపాయల పన్ను విధించే చట్టాన్ని రద్దుచేయాలని తీర్మానించామన్నారు. రెస్టారెంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటిన్నర కోట్ల టర్నోవర్ వుంటే 5 శాతం టాక్స్ వర్తిస్తుందన్నారు. 150కోట్ల టర్నోవర్ దాటితే 14.5 ట్యాక్స్‌చెల్లించే నిబంధన ఉందన్నారు. వాటిని తొలగించి స్లాబ్ పద్ధతిలో మార్చాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. తమిళనాడులో టర్నోవర్‌తో సంబంధంలేకుండా 2శాతం మాత్రమే పన్నువసూలుచేసే విధానం ఉందన్నారు. అదేవిధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో కామర్స్ ఉపాధ్యక్షులు మలిశెట్టి రవి, రాజు, బయ్ అండ్ సేవ్ మధు, కార్యదర్శి మధుసూధన్‌రావు, సంయుక్త కార్యదర్శులు కె.వి వాసు, ఉదయ్, కోశాధికారి కెవి చౌదరి ,పెద్ద సంఖ్యలో వ్యాపారులు పాల్గొన్నారు.