చిత్తూరు

మూడున్నర గంటల పాటు భయపెట్టి అడవిలోకి పారిపోయన పులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 25: తిరుమలలో పద్మావతి అతిథి భవనం ప్రాంతంలో ఉన్న నర్శింగ్ సదన్‌లో దూరి భక్తులను, అధికారులను హడలెత్తించిన పులి సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అడవిలోకి జారుకుంది. ఈవిషయాన్ని టిటిడి అధికారులు నిర్ధారించారు. నర్సింగ్ సదన్‌లో పులి దూరిందని అక్కడ పనిచేసే సిబ్బంది అధికారులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సహకారంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదే సమయంలో ఆ అతిథి భవనం మూడు గదుల్లో ఉన్న సిబ్బందిని సురక్షితంగా తీసుకురావడానికి జెఇఓ శ్రీనివాసరాజు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా అతిథి భవనం పక్కనే ఉన్న గాయత్రి సదన్ బాల్కానీ నుండి బాధితులు చిక్కుకున్న అతిథి భవనంలోకి నిచ్చెన వేసే ప్రయత్నం చేశారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో గదుల కిటికీలు తొలగించైనా భక్తులను బయటకు తెచ్చేందుకు ఉన్న మార్గాలను జెఇఓ పరిశీలిస్తున్నారు. రెండు గంటలకు ఆలస్యంగా తిరుమలకు చేరుకున్న జూ అధికారులు జెఇఓ సహా 13మంది సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పద్మావతి అతిథిగృహంలోని నర్సింగ్ సదన్‌లోకి దూరిన పులిని పట్టుకోడానికి విశేష కృషి చేశారు. వీరిలో తిరుమల అటవీ శాఖ రేంజి ఆఫీసర్ బాలాజీ ముందుగా తుపాకీ చేత పట్టుకొని లోపలికి ప్రవేశించారు. జూ డిఎఫ్‌ఓ జాకెట్ ధరించి పులికి ఇవ్వడానికి ఉపయోగించే మత్తు మందును ఒక గన్‌లో సిద్ధం చేసుకొని తన సహాయకుడితో లోపలికి ప్రవేశించారు. వీరితోపాటు పులి తిరగడబడితే పులపై వల విసరడానికి సంబంధించిన ఓ బృందంతోపాటు జెఇఓ శ్రీనివాసరాజు కూడా గదిలోకి ప్రవేశించారు. సుమారు అరగంటపాటు అతిథి భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే పులి జాడ కనబడలేదు. పులి కాలి జాడలను బట్టి నర్శింగ్ సదన్‌లో చొరబడిన పులి మొదటి అంతస్తులో తెరిచి ఉన్న కిటికీలోంచి పులి జంప్ అయిపోయిందని అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో టిటిడి అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పులి వెళ్లిపోయిందని తెలిసినా గదుల్లో ఉన్న భక్తులు మాత్రం బయటకు రావడానికి సాహసించలేకపోయారు. వాస్తవానికి నర్శింగ్ సదన్‌లో 12 గదులు ఉన్నాయి. ఇందులో ఆరు గదులను నాదనీరాజనం కార్యక్రమంలో పాల్గొనే కళాకారులకు కేటాయించారు. మరో మూడు గదుల్లో మాత్రమే భక్తులు ఉన్నారు. వీరులో ఒక గదిలో కడపకు చెందిన శివప్రకాష్, చెన్నైకు చెందిన మోహన్, లక్ష్మీనారాయణ అనే భక్తులు ఉన్నారు. మిగిలిన గదులు ఖాళీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా అతిథి భవనంలో ఉన్న భక్తులను కూడా మరో అతిథి భవనంలోకి మార్చివేశారు. ఈ ఆపరేషన్‌లో టిటిడి విజిలెన్స్ అధికారులు, విఎస్‌ఓ రవీంద్రరెడ్డి, డిఎఫ్‌ఓ శివప్రసాద్, జూ అధికారులు క్యూలేటర్ శ్రీనివాసులరెడ్డి, అసిస్టెంట్ క్యూలేటర్ సెల్వకుమార్, డాక్టర్ తొరియిపాల్‌సింగ్, జూ సిబ్బంది అజయ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.