చిత్తూరు

హరోం హరోం హర.. నామంతో మారుమోగిన శ్రీ కాళహస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, జూలై 28: ఆడికృత్తిక సందర్భంగా గురువారం శ్రీ కాళహస్తిలో వైభవంగా జరిగింది. పట్టణంలోని విజ్ఞానగిరిపై ఉన్న కుమారస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మొక్కుబడి ఉన్న భక్తులు పూలకావళ్లుతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నారద పుష్కరిణిలో తలనీలాలు సమర్పించి అక్కడే స్నానాలు చేశారు. మహిళా భక్తులు బట్టలుమార్చుకోవడానికి దేవస్థానం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటుచేశారు. తలనీలాలు సమర్పించిన తరువాత కొండపై ఉన్న శ్రీ కుమారస్వామిని దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న మెట్లు ద్వారా కొండపైకి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆ తరువాత కుమారస్వామి తిప్పవీధి ద్వారా కొండకిందకు చేరుకున్నారు. భక్తులు పసుపుదుస్తులు ధరించుకొని పూలకావళ్లతో హరోం హరా అంటూ కుమారస్వామిని స్మరించుకుంటూ కొండకు ఎక్కడం జరిగింది. భక్తులు ఇబ్బందులు పడకుండా శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది క్యూలైన్లవద్ద భక్తులను క్రమబద్ధం చేశారు. శ్రీ కాళహస్తీశ్వరాలయంలో శ్రీవళ్లి,దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ఆ తరువాత ఇంద్రవిమానంపై ఉత్సవమూర్తులను పట్టణంలో ఊరేగించారు. రాత్రి వరకు భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు
ఆడికృత్తిక సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. పెండ్లి మండపం వద్ద నుంచి కుమరస్వామి తిప్పమీదుగా వాహనాలను వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు .అదేవిధంగా ఆర్టీసీ బస్టాండు కొత్తపేట ప్రాంతాలకు కూడా వాహనాలు రాకుండా చర్యలు తీసుకున్నారు. డి ఎస్పీ వెంకటకిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యులు బాలజి, జయగోపాల్ తదితరులు ఇ ఓ భ్రమారాంబ ఏర్పాట్లను పరిశీలించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిట్రస్టు ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా ప్రసాదాలను పంచిపెట్టారు. ట్రస్టుబోర్డు చైర్మన్, ఇ ఓ ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉచితంగా ప్రసాదాలు పంచిపెడుతున్న ట్రస్టు సభ్యులను గురవయ్యనాయుడు అభినందించారు. భక్తులు ఉదయం నుంచి పూలకావళ్లతో రావడంతో పట్టణాల్లో సందడి నెలకొంది. మధ్యాహ్నానికి సుమారు 2వేల పూలకావళ్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం వరకు ఆడికృత్తిక ఉండటం వల్ల భక్తులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
రాహు-కేతు పూజల్లో కన్నా లక్ష్మీనారాయణ
మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక రాహు-కేతు పూజలు చేయించుకున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన రాహు-కేతు పూజలు చేయించుకొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ట్రస్టుబోర్డు మాజీ అధ్యక్షులు కోలా ఆనంద్ స్వాగతం పలికారు. దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు స్వామి,అమ్మవార్ల ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.
నెమలిపై విహరించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
ఆడికృత్తిక సందర్భంగా శ్రీ వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి నెమలి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆడికృత్తిక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అలంకార మండపం నుంచి ఉత్సవమూర్తులను వాహనంపై పెట్టి సిబ్బంది ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్, సభ్యులు, ఇ ఓ పాల్గొన్నారు. నెమలి వాహనంపై ఊరేగిన స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకొని కొబ్బరికాయలుకొట్టి మొక్కులు తీర్చుకున్నారు.