చిత్తూరు

ఘాట్‌రోడ్డులో జారిపడిన మట్టిపెళ్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుమలలో గురువారం నుండి కురిసిన భారీ వర్షం ధాటికి రెండవ ఘాట్ రోడ్డులోని పలుచోట్ల మట్టి పెళ్లలు జారిపడ్డాయి. తిరుమలలో గురువారం సాయంత్రం 6.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రెండవ ఘాట్‌రోడ్డులోని 8వ కిమీ వద్ద రాత్రి 11 గంటల సమయంలో, 14వ కిలోమీటర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున సమయంలో కొండపై నుంచి మట్టిపెళ్లలు జారిపడ్డాయి. దీంతో రెండో ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఘాట్‌రోడ్డు సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని జారిపడ్డ మట్టిపెళ్లలను తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. మట్టి పెళ్లలు జారిపడ్డ ప్రాంతాలను పరిశీలించి ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టిటిడి ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆదేశించారు.