చిత్తూరు

ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తే ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 1: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిపక్షం లేకుండా చేయాలని అధికారపార్టీలు ప్రయత్నిస్తున్నాయని, అయితే అలాచేస్తే ప్రజలే ప్రతిపక్షంగా మారి ప్రభుత్వాన్ని నిలదీస్తారని సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు నారాయణ అన్నారు. స్థానిక బైరాగిపట్టెడలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా తమ తీరుమార్చుకోకుంటే బాబు, కెసిఆర్‌లు చరిత్రహీనులుగా మారుతారని అన్నారు. దీనికితోడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డదారుల్లో ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నతీరు ఆందోలన కలిగిస్తోందని అన్నారు. విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని చెబుతున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకి తనతోపాటు, ఏపి సి ఎం చంద్రబాబు నాయుడుకూ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చామన్న విషయాన్ని మరచిపోరాదన్నారు. బిజెపి నేతల తీరు చూస్తుంటే విశ్వవిద్యాలయాల్లో బిజెపికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరగకుండా కుట్రపన్నుతున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఏబివిపి ఒక్కటే విద్యాలయాల్లో ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇందుకోసం వర్శిటీలను పోలీస్ క్యాంపులుగా మార్చేస్తున్నారని నారాయణ విమర్శించారు. ఏపి, తెలంగాణ సి ఎం లు ఒకరిని ఒకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం మానుకుని రాష్ట్భ్రావృద్ధిపై దృష్టిసారించాలన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేల జీతాలు రెండురెట్లు పెంచిన సిఎంలు ఇద్దరు రాష్ట్రాల్లోని ఉద్యోగుల జీతాలు కూడా ఆదేస్థాయిలో పెంచాలన్నారు.
తమిళనాడులో అన్నాడి ఎం కె, డి ఎంకె పార్టీలకు వామపక్ష, వైగో, విజయకాంత్ పార్టీ కూటమే సరైన ప్రత్యాన్మాయమన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపి ముందుంటుంది
* జల్లి మధుసూధన్ వెల్లడి
తిరుపతి, ఏప్రిల్ 1: ఆధ్మాత్మిక క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపి ముందుంటుందని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జల్లి మధుసూధన్ అన్నారు. స్థానిక సంజయ్‌గాంధి కాలనీ (8వ వార్డు) డోర్ నె. 20-5-42/6లో ఉన్న మునిసిపల్ మోటారు బోరు పైప్‌లైన్ మరమ్మతుకు గురైన విషయాన్ని బిజెపి ఓబిసిమోర్చా రాష్ట్ర అధ్యక్షులు జల్లిమధుసూధన్ ఆధ్వర్యంలో వార్డులోని బిజెపి నాయకులు,మహిళలు, మహిళలు నగర పాలక సంస్థ కమిషనర్ వినయ్‌చంద్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ప్రజలకు ఉపయోగపడేలా దాన్ని మరమ్మతు చేయించారు. వాటర్ ట్యాంక్ ఏర్పాటుచేసి దానికి నాలుగు కొళాయిలను ఏర్పాటు చేశారు. శుక్రవారం జల్లిమాధున్ మోటారుబోరును ప్రారంభించారు. అనంతరం సభలో ఆయన ప్రసంగిస్తూ నగరంలోని 50 డివిజన్లలో ఉన్న ప్రజలకు నీటి సమస్యలేకుండా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులు కోరారు. అలాగే అన్ని వార్డుల్లో మరమ్మతుకు గురైన బోర్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 50వ డివిజన్లలో ఎక్కడినీటి సమస్య ఉన్నా వాటిని తమ దృష్టికి తెస్తే పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే బిజెపి ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో పాదచారులకు, తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నగరంలో చలివేంద్రాలను ఏర్పాటుచేయాలని పిలుపునిచ్చారు. సంజయ్‌గాంధీ కాలనీలో నీటి సమస్యపై వెంటనే స్పందించి ప్రజలకు నీరందేలా చర్యలు తీసుకున్న నగర పాలక సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని జల్లిమధుసూధన్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, స్థానిక బిజెపి నాయకురాళ్లు ఎల్లమ్మ, జ్యోతి, ఫాతిమ, నాగభూషణమ్మ, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఇసుక రీచ్‌ను సందర్శించిన మైన్స్ అధికారులు
నాగలాపురం, ఏప్రిల్ 1: నాగలాపురం మండలం సురుటుపల్లి, కారణి, నందనం గ్రామాల్లో జరుగుతున్న ఉచిత ఇసుక రీచ్‌ను శుక్రవారం జిల్లా మైన్స్ అధికారులు సందర్శించి రెవెన్యూ మరియు ఎంపిడివో సిబ్బందితో కలసి ఇసుక రీచ్‌ను సర్వే చేపట్టారు. ఈ ఇసుక రీచ్‌లో 19,800 క్యూబిక్ మీటర్‌కు అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ పిచ్చాటూరు మండలం బహదూర్ పేట సురుటుపల్లికి సంబంధించి ఈ రీచ్‌ను ఏర్పాటుచేశారు. కానీ ఈ రీచ్‌కు సంబంధించి నాగలాపురం ఎంపిడివో కార్యాలయం ఇ ఓ పి ఆర్ డి లక్ష్మీపతి, సంబంధిత అధికారులు, పిచ్చాటూరు మండలం, బహదూరుపేట,నాగలాపురం మండలం సురుటుపల్లికి వేరువేరుగా రీచ్‌లు ఏర్పాటుచేయాలని వారు మైన్స్ అధికారులను కోరారు. అనంతరం మైన్స్ అధికారి సోమశేఖర్, డిస్ట్రిక్ గ్రౌండ్ వాటర్ అధికారి శివప్రసాద్‌లు మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో జరుగుతున్న ఇసుకరీచ్‌ను సందర్శించి వాటిపై ఆరా తీయడానికి మాత్రమే వచ్చామని , ఇక్కడ ఇసుకకు సంబంధించి తహశీల్దార్ , ఎంపిడివోకు సమాచారం ఇవ్వడం జరిగిందని, దీనిపై నిఘా పెట్టి ఇసుక తీయవలసిన క్యూబిక్‌మీటర్ ప్రకారం తీసేందుకు తాము చర్యలు చేపడుతామని ఆయన అన్నారు.
రేపు తిరుపతి నుంచి గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల చైతన్యయాత్ర

తిరుపతి, ఏప్రిల్ 1: రాష్ట్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడానికి ఈనెల 4వ తేదీన స్థానిక టిటిడి గోశాల వద్ద నుంచి చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న ఈకార్యక్రమాన్ని భారతీయ కిసాన్ సంఘ్, గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం, ప్రకృతి ఫౌండేషన్ నిర్ణయించినట్లు వివరించారు. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు నిర్వహించనున్న చైతన్యయాత్రలో ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. భూమి సారవంతాన్ని పరిరక్షిస్తూ క్రిమి సంహారకాల్లేని ఆహార ఉత్పత్తులకు ప్రకృతి వ్యవసాయ విధానాలు అవసరం అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆహార ఉత్పత్తుల దిగుబడి పెంచడానికి రసాయన ఎరువులు వాడకం అధికమై భూమి భౌతిక స్వరూపాన్ని, భూమిలోని జీవరాశులకు పెనుప్రమాదంగా మారిందని వివరించారు. దీంతో ఆహార ఉత్పత్తులు విషతుల్యమై అందరి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న విషయం గుర్తించాలన్నారు. ఈవిషయంలో రైతులను చైతన్యవంతం చేయడానికి గత రెండు సంవత్సరాలుగా తాము కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు.

అసెంబ్లీలో అంతా ఏకపక్షమే
* వైకాపా ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ ఆరోపణ
మదనపల్లె, ఏప్రిల్ 1: గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల కంటే నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాలు చాలా బెటరే, అయితే నియోజకవర్గాలలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పినా, వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు ఇవ్వబోమని నియంతలా వ్యవహరిస్తున్నారని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మదనపల్లె వైకాపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా మదనపల్లె పట్టణంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి నిధులివ్వమని కోరగా వైకాపా నియోజకవర్గాలకు ఎలాంటి నిధులు ఇవ్వబోమని మంత్రులు, ముఖ్యమంత్రి ప్రకటించి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. సమప్రాధాన్యం ఇస్తామని ప్రకటనలే తప్ప అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో రాయలసీమ చాలా వెనుకబడి ఉందని, జిల్లావాసి అయిన సిఎం చంద్రబాబు సీమను పట్టించుకోకుండా విజయవాడ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హంద్రీ-నీవాకాల్వ తవ్వకాలు, నిర్మాణాలకు రూ.1300కోట్లు అవసరం ఉండగా రూ.500కోట్లు విడుదల చేసిందని, అందులో రూ.350కోట్లు పాతబకాయిలు చెల్లించడం, మిగిలిన రూ.150కోట్లుతో గడువులోగా పూర్తిచేస్తామని ప్రజలకు మాయమాటల చెబుతున్నారన్నారు. ఈ విలేఖరుల సమావేశం సర్పంచి శరత్‌కుమార్‌రెడ్డి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
‘విద్యుత్ కష్టాలు అధిగమించేందుకు కృషి’

కుప్పం, ఏప్రిల్ 1: కుప్పం రెస్కో పరిధిలో రైతులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు విద్యుత్ సమస్యలు అధికమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రెస్కో చైర్మన్ మునిరత్నం తెలిపారు. శుక్రవారం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పం రెస్కో పరిధిలోని ఆరు సెక్షన్ కార్యాలయాల పరిధిలో రైతులు పొందిన ట్రాన్స్‌ఫార్మర్ల వివరాలు, వాడుతున్న విద్యుత్, అదనపుఆర్ట్స్ పవర్ తదితర వివరాలు సిబ్బంది సేకరిస్తున్నారని అన్నారు. అదనపువిద్యుత్ లోడుపెరిగి తరచూ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలుతున్నాయని పేర్కొన్నారు. వీటిని క్రమబద్దీకరించుకునేందుకు రైతులు సహకరించాలని కోరారు. ట్రాన్స్‌ఫార్మర్‌లు పరిధిలో ఉండే రైతులు, సర్వీసు నెంబర్లు, విద్యుత్ వాడకాలపై డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. హెచ్‌డివిఎస్ ట్రాన్స్‌ఫార్మర్ల అదనపు లోడులకుగాను ఆరువేల రూపాయలు చెల్లించి హార్స్ పవర్‌కు 1300రూపాయల వంతున రైతులు కట్టాల్సి ఉంటుందన్నారు. తాము రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నామని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నదే తమ ఆశయమన్నారు. రైతుల కోసం ట్రాన్స్‌ఫార్మర్లు సైతం అందుబాటులో తీసుకువస్తామని అన్నారు. ఈసమావేశంలో సిఎంపిఎ మనోహర్, ఎండి షణ్ముగం, ఎంపిపి సాంబశివన్, జడ్పిటిసి రాజ్‌కుమార్, ఎఎంసి చైర్మన్ సత్యేంద్రశేఖర్, రెస్కో ఉపాధ్యక్షులు చలపతి, డైరెక్టర్లు శ్రీనివాసులు, మునస్వామి, మునిరామయ్య, రామ్మూర్తి, షణ్ముగం, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా కుప్పం పట్టణంకు వివిధ రకాల కూరగాయలు, టమోటాలు తదితరాలు విక్రయాలకు తీసుకువచ్చే రైతుల నుంచి గ్రామ పంచాయతీ తరపున ఎలాంటి గేటు వసూళ్లు ఉండవని రెస్కో చైర్మన్ తెలిపారు. సిఎం పిఎ మనోహర్ మాట్లాడుతూ రైతులు బాగుండాలనే లక్ష్యంతోనే రైతుల నుంచి గేటు వసూళ్లు చేయరాదని గతంలో సి ఎం దృష్టికి తీసుకెళ్లారని, అలాగే కుప్పం పంచాయతీ పాలకవర్గం సైతం ఈ మేరకు తీర్మానించినట్లు తెలిపారు. రైతుల ఆర్థిక కష్టాలు కొంతవరకు తొలిగేలా గేటు వసూళ్లను ఆపినట్లు తెలిపారు.
ఎఎంసి చైర్మన్ సత్యేంద్రశేఖర్ మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో కుప్పంలో ఇదివరకు ప్రైవేటు మండీల వారు వసూలుచేసే కమిషన్లు సైతం పది నుంచి 8శాతానికి తగ్గించామన్నారు. రైతుల కోసం మార్కెట్ యార్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.