చిత్తూరు

మధుమేహ వ్యాధిపై ఎండో విభాగం ద్వారా పరిశోధనలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 7: స్విమ్స్ ఆసుపత్రిలో స్టడీ ఇన్ డయాపెటాలజీ అండ్ రీసెర్చ్‌రంగంలో ఎండోవిభాగంద్వారా పరిశోధనలకు పెద్ద పీట వేస్తామని డైరెక్టర్ టి ఎస్ రవికుమార్ తెలిపారు. స్విమ్స్ పద్మావతి ఆడిటోరియంలో రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో మేనేజిమెంట్ ఆఫ్ డయాబెటీస్ అనే అంశంపై జరిగిన 6వ రాష్ట్ర సదస్సును డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఐ వి రావ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాబిటీస్‌పై పరిశోధనలకు అవసరమైతే బాలజి ఆరోగ్య వరప్రసాదిని స్కీం ద్వారా అందుతున్న ఆర్థిక వనరులను వినియోగిస్తామన్నారు. యోగా ద్వారా కూడా డయాబిటీస్, క్యాన్సర్ వ్యాధుల తీవ్రతను తగ్గించవచ్చన్నారు. ఈ రంగంలో అభివృద్ధి సాధించడంకోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇతర వైద్యసంస్థల్లో కలిసి పనిచేస్తామన్నారు. ఎన్టీ ఆర్ హెల్త్ సైనె్సన్‌మాజీ విసి డాక్టర్ ఐవి రావుమాట్లాడుతూ స్విమ్స్, ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్సిటీ సంయుక్తంగా డయాబిటీస్ వ్యాధిపై పరిశోధన చేస్తామన్నారు. ఐ ఎం ఎ తిరుపతి శాఖ ప్రెసిడెంట్, మధుమేహ వ్యాధి నిపుణురాలు డాక్టర్ కృష్ణప్రశాంతి మాట్లాడుతూ రాష్టవ్రిభజన జరిగిన తరువాత స్విమ్స్‌నందు ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు డయాబిటీస్‌పై సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీ్ధర్, ఎండ్రోకెనాలజీ వైద్యులు డాక్టర్ అలోక్ సచన్, డాక్టర్ సురేష్, పిజి విద్యార్థులు పాల్గొన్నారు.