చిత్తూరు

తప్పిన పెను ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకాల, ఆగస్టు 7: వర్షం పడుతోందని రోడ్డుపక్కన ఉన్న చింతచెట్టు కింద ఆటోను ఆపితే ఆ చింతచెట్టు ఆటోపై కూలిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పీలేరు-చిత్తూరు రహదారి లోని పాకాల మండలం దామలచెరువుగుండ్లగుంటపల్లి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలుకాగా,మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఐరాల మండలం పుల్లూరు ఎర్రేపల్లికి చెందిన లోకనాథరెడ్డి (60), అతని భార్య లక్ష్మి (55) ఆటో డ్రైవర్ దేవాలు పాకాల మండలం ఎర్రేపల్లి వద్ద ఉన్న బంధువుల ఇళ్లకు బయలుదేరారు. సాయంత్రం గుండ్లగుట్లపల్లి సమీపంలోకి వచ్చేసరికి వర్షం పడింది. దీంతో రోడ్డుపక్కనే ఉన్న చింతచెట్లుకింద ఆటోను ఆపి వర్షం నిలిచినాక వెళ్లాలను కుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఇటీ వల కురిసిన వర్షాలకు, సాయంత్రం పడ్డ వానకు బాగా నాణిపోయి ఉన్న చింతచెట్టు ఆటోపై పడిపోయింది. దీంతో ఆటోలోని లక్ష్మికి కాలువిరిగిపోగా, లోకనాథరెడ్డి, దేవాలకు స్వల్పగాయాలయ్యాయి. చింతచెట్టు పడిన ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. పీలేరు-చిత్తూరు రహదారిలో రోడ్డుకు అడ్డం పడిపోవడంతో కొద్దిసేపురాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు, పాకాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి రాకపోకలను పునరుద్ధరించారు. ఇంత భారీ వృక్షం ఆటోమీదపడినా స్వల్పగాయాలతో బయట పడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.