చిత్తూరు

ప్రశాంతంగా సివిల్ ప్రిలిమినరీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 7: దేశవ్యాప్తంగా జరుగుతున్న సివిల్ ప్రిలిమినరీ పరీక్షల్లో భాగంగా తిరుపతిలో ఆదివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాయలసీమ 4 జిల్లాల నుంచి 8వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటిపేపరు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు రెండోపేపర్ 2 నుంచి 5 గంటలరకు నిర్వహించారు. పరీక్షకు 20 నిముషాల ముందు అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. 10 నిముషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను మానవతాధృక్పథంతో పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. ప్రతి పరీక్షాకేంద్రం ముందు 144 సెక్షన్ అమలుచేశారు. పరీక్షాకేంద్రానికి పరిసరప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ దుకాణాలను మూయించివేశారు. పెన్, హాల్‌టిక్కెట్‌లతో మాత్రమే అభ్యర్థులను పరీక్షాకేంద్రాలకు అనుమతించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 9.10 గంటలకు పరీక్షలు ప్రారంభించామని, 9.20 గంటల వరకు అభ్యర్థులను అనుమతించామన్నారు.