చిత్తూరు

గౌతమినగర్‌లోని ఇంట్లో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఏప్రిల్ 3 : ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉన్నట్టుండి ఓ ఇంట్లో పెద్దశబ్ధంతో పేలడంతో సమీపంలో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. మదనపల్లె రెండవ పట్టణ సిఐ హనుమంత్‌నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ శివారు ప్రాంతం చీకలిగుట్ట గౌతమినగర్‌లో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం (55) గొర్రెల మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమారుడు మృతిచెందగా కోడలు అన్నపూర్ణ, ఇద్దరు పిల్లలు పక్కింట్లోనే నివాసముంటున్నారు. అన్నపూర్ణ ఇంటి పక్కనే ఉన్న ఖాళీస్థలంలో గొర్రెల మంద వేసుకుంది. కోడలు అన్నపూర్ణ కూలీ పనులకు, పిల్లలు పాఠశాలకు వెళ్లగా, ఆదివారం మధ్యాహ్నం గొర్రెలు మేతకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం మందను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా అన్నపూర్ణ ఇంట్లో పెద్దశబ్ధంతో పేలింది. దీంతో సుబ్రహ్మణ్యంపై గోడ కూలిపోవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ సేఫ్‌గా ఉండగా పెద్దశబ్ధంతో పేలడం, ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో పేలుడు పదార్థాలే ఉండవచ్చని పోలీసులు, అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న అన్నపూర్ణ హుటాహుటిన ఇంటికి చేరుకోగా, ఇంట్లోని 32 వేల నగదు కట్టలు కాలిపోయి, రెండు బంగారు ఉంగరాలు, రెండు బంగారు గాజులు కరిగిపోయి కన్పించడంతో కన్నీరుమున్నీరుగా విలపించించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.