చిత్తూరు

దిక్కుతోచని స్థితిలో టమోటా రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచెర్ల, ఆగస్టు 9 : టమోటా ధర నేలకు దిగడంతో టమోటా సాగుచేసిన రైతులు టమోటా దిగుబడులను నేలపాలు చేస్తున్నారు. మార్కెట్‌కు తరలించి విక్రయిస్తే కూలీ, రవాణా ఖర్చులు కూడా రావని, చేతి నుంచే అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందని రైతులు భావిస్తున్నారు. మండలంలో టమోటా సాగుచేసి దిగుబడులు అందుకుంటున్న రైతులు గిట్టుబాటు ధర లేనందున పంటను కోయకుండా చేలపైనే వదిలేస్తున్నారు. గిట్టుబాటు ధర వస్తే కోయాలని అనుకుంటున్నారు. దీంతో చాలావరకు పంట చేలపైనే దెబ్బతింటోంది. కుళ్లి, పురుగుపట్టి చేలపైనే రాలిపోతోంది. వేలాది రూపాయలు పెట్టి సాగుచేసిన టమోటా పంటకు గిట్టుబాటు ధరలేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మండలంలో టమోటాను విస్తారంగా సాగు చేయడంతో దిగుబడులు వస్తున్న దశలో ధర పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. స్థానిక మార్కెట్లో గత వారం ఎక్కువగా టమోటాలు అమ్మకాలకు వచ్చినా కొనేవారు లేక రైతులు నిరాశ చెందారు.