చిత్తూరు

జాతీయ వయోవృద్ధుల మండలి సభ్యుడిగా డాక్టర్ గుత్తా మునిరత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 11: జాతీయ వయోవృద్ధుల మండలి సభ్యులుగా దక్షిణభారతదేశంలోని స్వచ్ఛంద సేవా సంస్థల తరపున భారత ప్రభుత్వ సామాజిక మంత్రిత్వ శాఖ రాస్ ప్రధాన కార్యదర్శి పద్మశ్రీ డాక్టర్ గుత్తామునిరత్నంను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని వివిధ వర్గాలకు చెందిన నిష్ణాతులై వివిధ సంస్థల నిర్వాహకులలో 25 మందిని ఈ మండలిలో అనధికార సభ్యులుగా నియమించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల నియామకం కూడా త్వరలో జరుగుతుందని తెలుస్తుందన్నారు. దేశంలో వయోవృద్ధుల సంక్షేమానికి జరుగుతున్న పథకాలను సమీక్షించి వారికి రక్షణ, భద్రత, ఆరోగ్య సదుపాయాలు, న్యాయ సలహాలు అందించి వారి సంక్షేమానికి కృషిచేసుందుకు ఈ మండలిని భారత ప్రభుత్వం నియమించిందన్నారు. వయోవృద్ధుల సంక్షేమ పథకాలను స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఆర్థిక సహాయం చేసే వివిధ సంక్షేమ పథకాలు నిర్వహించే సంస్థలకు గ్రాంట్లు మంజూరుచేసే కమిటీలో కూడా డాక్టర్‌గుత్తామునిరత్నంను నియమించామన్నారు.
ఈ కమిటీ పదవీకాలం 3 సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. గత 30 సంవత్సరాలుగా చిత్తూరు, అనంతపురం, తిరుత్తణి ప్రాంతాల్లో 12 వయోవృద్ధుల ఆశ్రమంలో రాస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సమాజంలో, కుటుంబంలో గౌరవప్రదమైన జీవనం సాగించడానికి రాస్ వినూత్న పథకాల ద్వారా సహాయపడుతుందన్నారు.