చిత్తూరు

మా బిడ్డ ప్రాణాలు తీసిన అల్లుడిని శిక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 11 : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నదని అగ్ని సాక్షిగా పెళ్లాడిన తమ కుమార్తె ను హతమార్చిన అల్లుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్వప్న తల్లిదండ్రులు వాపోయారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బెంగళూరుకు చెందిన స్వప్న తల్లి దండ్రులు జి కాంతరాజ్, కె అమ్ము విలేఖర్లతో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం తమ మూడవ కుమార్తె స్వప్నను చిత్తూరు నగరం వెంగళరావుకాలనీకి చెందిన ఏ అజయ్‌కు ఇచ్చి వివాహం చేశామన్నారు. అతని స్నేహితుడు ఏడుకొండలు సహకారంతో అదేవీధిలో నివాసం ఏర్పాటుచేసుకున్నారన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారని వివరించారు. అయితే తమ అల్లుడు ఏడుకొండలు సహకారంతో వారు కాపురం ఉంటున్న అద్దె ఇంట్లో నివసిస్తున్న ఓ వివాహితతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తమ కుమార్తె భర్త అజయ్‌ను నిలదీయడంతో పాటు, న్యాయం చేయాలంటూ ఏడుకొండలను ప్రాధేయడిందన్నారు. అయినా భర్త పట్టించుకోకపోగా, ఏడుకొండలు సైతం తమ కుమార్తె వేదనను అర్థం చేసుకోలేదని వాపోయారు. అల్లుడి ఆగడాలు ఎక్కువ కావడంతో ఇటీవల తాము చిత్తూరుకు వచ్చి మందిలించినా ఫలితం లేదన్నారు. అజయ్ వివాహిత మహిళతో అక్రమ సంబంధం కొనసాగించడాన్ని సహించలేక నిలదీసిన తన కుమార్తె స్పప్నను ప్రియురాలు, ఏడుకొండలు సహకారంతో ఈ నెల 7వ తేదీన గుట్టుచప్పుడు కాకుండా గొంతు నులిమి చంపారని ఆరోపించారు.