చిత్తూరు

ప్రభుత్వాసుపత్రిలో పాముల బెడద నివారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 11: చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో పాముల బెడదను నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణిచంద్రప్రకాష్ వైద్యాధికారులను ఆదేశించారు. ఇటీవల చిత్తూరు రూరల్ మండలం పాఠశాల కమిటీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిడిపి కార్యకర్తలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇటీవల చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో పాములు హల్‌చల్ చేసి ఇటు రోగులను, అటు సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే పాములు వచ్చే అవకాశం ఉండదని చెప్పారు. ముఖ్యంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ఏటా కోట్లాది రూపాయలు కేటాయిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా సిబ్బంది సహకరించాలన్నారు. చిత్తూరు ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందని, అలాగే ఈ ఆసుపత్రిని అపోలో సంస్థ లీజుకు తీసుకున్న నేపథ్యంలో రోగులకు మంచి వైద్యం అందేవిధంగా కృషి చేయాలన్నారు. ఈ ఆసుపత్రి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా అన్ని వసతులు ఉన్న నేపథ్యంలో ప్రజల్లో సదాభిప్రాయం కలిగే విధంగా సేవలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ ఆసుపత్రికి ప్రభుత్వం ఓపిల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీన్నిబట్టి చూస్తే ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా వైద్యసేవలు అందుతాయన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ ఎస్ సరళ, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.