చిత్తూరు

ప్రతి మహిళా ఈ-లిటరేట్ కావాలనేదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 18: రాష్ట్రంలో ప్రతి మహిళా ఈ-లిటరేట్ కావాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ అన్నారు. గురువారం స్థానిక బైరాగిపట్టెడలోని మహాత్మాగాంధీ మునిసిపల్ హైస్కూల్‌లో నిర్వహించిన కృష్ణా పుష్కరాలపై చర్చాగోష్టిలో భాగంగా ఆరోగ్యం- ఫిజికల్ లిటరసీ, మెరుగైన జీవన విధానం, మంచి అలవాట్లు-చెడు అలవాట్లకు దూరం, పౌష్టికాహారం అనే అంశాలపై చర్చాగోష్టి జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళ జవన ప్రమాణ స్థాయిలు పెంచడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదన్నారు. మహిళలందరూ వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కృష్ణా పుష్కరాలు జరిగే 12 రోజులలో 12 అంశాలపై వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల చర్చాగోష్టి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా తల్లి, బిడ్డలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. 1044 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారులకు 2.50 లక్షల రూపాయల వరకు ఉచిత ఆపరేషన్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. మహిళలకు అనేక వృత్తివిద్యాకోర్సులతో శిక్షణలు నిర్వహించి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తోందన్నారు. ప్రస్తుతం 8 లక్షలా 20 వేలు విలువచేసే 196 కుట్టుమిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. త్వరలో తిరుపతిలో లబ్ధిదారులకు మరో 360 కుట్టుమిషన్లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మాసిబ్బంది, జన్మభూమికమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.