చిత్తూరు

25న తిరుమలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి, 26న ఉట్లోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఆగస్టు 19: శేషాద్రిపై వెలిసి ఉన్న కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీ కృష్ణునిడిగా స్మరించుకొని శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఈనెల 25వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల నడుమ గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. కాగా ఆగస్టు 26న తిరుమలలో ఉట్లోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీ కృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దుచేసింది. ఈవేడుకల్లో టిటిడి ఉన్నతాధికారులు ఉత్సాహంగా పాల్గొంటారు.