చిత్తూరు

ఎకరం వేరుశనగ పంటను కూడా ఎండనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, ఆగస్టు 25: జిల్లాలో ఖరీప్‌లో సాగవుతున్న వేరుశనగ పంటకు వర్షాభావంతో ఎండుముఖం పడుతుండటంతో రైతుల నష్టపోకూడదన్న సిఎం చంద్రబాబు ప్రత్యేకంగా పంటలు కాపాడుకునేందుకు రెయిన్‌గన్‌లు, ఆయిల్ ఇంజన్‌ల సహకారంతో ఎకరం వేరుశనగ పంట కూడా ఎండనివ్వమని చిత్తూరుజిల్లా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం మదనపల్లె, తంబళ్ళపల్లె నియోజకవర్గాలలో పర్యటించారు. ముందుగా మండలంలోని బసినికొండ, వలసపల్లె పంచాయతీలలో ఎండుముఖం పట్టిన వేరుశనగపంటలను పరిశీలించారు. మరో వారంరోజులలో వర్షాలు సకాలంలో పడనిపక్షంలో వేరుశనగ పంటలు పూర్తిగా నాశనం అయ్యేవని, అయితే స్పందించిన సిఎం చంద్రబాబు వ్యవసాయాధికారులతో చర్చించి జిల్లాకు 962రెయిన్‌గన్‌లు, 450ఆయిల్ ఇంజన్‌లు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ప్రతిమండలంలో రెయిన్‌గన్‌లు, స్పింకర్లు అందుబాటులో తీసుకువచ్చి బోరులు, బావులు ఉన్న వారికి రెయిన్‌గన్‌లు, నీటి సౌకర్యం లేని పంటపొలాలకు నీటిట్యాంకర్‌లు తెప్పించి ఆయిన్‌ఇంజన్‌ల సహకారంతో రెయిన్‌గన్‌తో పంటలు తడుపుతున్నట్లు తెలిపారు. ఒక్కసారి తడిపిన పంట పదిరోజుల పాటు తడివుంటుందని, ఈ తరహాలో ప్రతిరోజు 1800హెక్టార్లలో రెయిన్‌గన్‌ల సహకారంతో పంటలను కాపాడుతున్నట్లు తెలిపారు. అనంతరం కురబలకోట మండలం తెట్టు పంచాయతీలోని రామక్రిష్ణారావు వేరుశనగ పంటపొలంలో పర్యటిచాంచారు. గత 20ఏళ్ళ తర్వాత వేరుశనగ పంటలు సాగుచేస్తున్నామని రైతు రామక్రిష్ణారావు తెలిపారు. అయితే సకాలంలో వర్షాలు అనుకూలించడంతో పాటు విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందని, అయితే ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో పంటలు ఎండుముఖం పడకుండా రెయిన్‌గన్‌ల సహకారంతో పంటలు తడుపుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ మాట్లాడుతూ ప్రతిరైతుకు 50శాతం సబ్సిడీతో రెయిన్‌గన్‌లు పంపిణీకి సిఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో జరుగుతున్న హాంద్రీ-నీవా డిసెంబర్ నెలాఖరుకు పూర్తికానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని చెరువులకు హంద్రీ-నీవా జలాలు అనుసంధానం చేయడానికి రూ.144కోట్లు ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థికశాఖ ఆమోదంలో ఉన్నాయని ఎమ్మెల్యే శంకర్ వెల్లడించారు. వీరి వెంట వ్యవసాయశాఖ ఎడిఎ భాస్కర్‌రెడ్డి, మదనపల్లె వ్యవసాయాధికారి నవీన్‌కుమార్, ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌రెడ్డి, టిడిపి నియోజకవర్గం సమన్వయకర్త రాటకొండ సురేంద్ర(చినబాబు), మదనపల్లె, తంబళ్ళపల్లె నియోజకవర్గాల సమన్వయకర్త కొపూరి మల్లికార్జుననాయుడు, శ్రీరామ్‌చినబాబు, మండల పార్టీ అధ్యక్షులు దొరస్వామినాయుడు, పఠాన్ ఖాదర్‌ఖాన్(తాజ్), దాదూఖాన్, నిమ్మనపల్లె సాజిద్, పోతబోలు సుధాకర్, శివరామ్, కార్పెంటర్ గౌస్‌ఆజమ్, శ్రీరామవిద్యాసాగర్, చంద్రశేఖర్‌నాయుడు తదితరులు ఉన్నారు.