చిత్తూరు

పవన్ కల్యాణ్ సభకు కార్పొరేషన్, పోలీసుల అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 26: జనసేన పార్టీ నాయకులు తిరుపతిలో శనివారం సాయంత్రం 4 గంటలకు ఇందిరామైదానంలో జరిగే సభలో పవన్‌కల్యాణ్ పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి నగర పాలక సంస్థ అధికారుల నుంచి ఇందిరామైదానంలో సభను నిర్వహించుకోవడానికి అనుమతి పొందారు. అయితే పవన్ బహిరంగసభ నిర్వహిస్తే పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా పరమైన సమస్యల పట్ల కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. భద్రతకు అవసరమైన ఇంత మంది పోలీసులు లేరని పోలీసు అధికారులు జనసేన నాయకులతో అన్నట్లు సమాచారం. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సభ నిర్వహిస్తామని పవన్‌కల్యాణ్ అర్బన్ ఎస్పీ జయలక్ష్మికి మాటిచ్చిన నేపథ్యంలో సభ నిర్వహణకు పోలీసుల వైపునుంచి కూడా అనుమతి లభించినట్లు కూడా తెలుస్తోంది. కోలార్‌లో హత్యకు గురైన వినోద్‌రాయల్ కుటుంబాన్ని పరామర్శించడానికి గురువారం పవన్ తిరుపతికి వచ్చిన విషయం పాఠకులకు విదితమే. అదేరోజు మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్న పవన్ పద్మావతి అతిథి భవనం ప్రాంతంలోని టి.సుబ్బరామిరెడ్డి అతిథి భవనంలోబస చేస్తున్నారు. ఈక్రమంలో ఆయన గురువారం శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. శుక్రవారం మరోమారు విరామసమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకొని నేరుగా తిరుపతిలో జరుగనున్న సభావేధికకు చేరుకుంటారని జనసేన వర్గాలు తెలిపాయి. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే తిరుమలలో వపన్‌కల్యాణ్ రెండు రోజులుగా బస చేసి ఉన్నా శుక్రవారం వరకు ఆయన ఎవర్నీ కూడా కలవకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు టిటిడి బోర్డు సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్, పవన్‌కల్యాణ్ వీరాభిమాని కిరణ్‌రాయల్ లాంటి అతి ముఖ్యులు మాత్రమే పవన్ కల్యాణ్ గదిలోకి వెళ్తున్నారు.
జన సమీకరణపై జనసేన నాయకుల దృష్టి
పవన్‌కల్యాణ్ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత తొలిసారిగా తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో సభను పూర్తిస్థాయిలో విజయవంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పవన్‌పవర్‌పై ఒక సంకేతాన్ని బలంగా పంపించాలని నాయకులు యోచిస్తున్నారు. ఈక్రమంలో జన సమీకరణపై కూడా ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. హత్యకుగురైన పవన్ అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని సందర్శించడానికి వచ్చిన పవన్‌కల్యాణ్‌ను చూడటానికి తక్కువ సమయంలోవేల సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో శనివారం నాటి సభను పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని నాయకులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని జిల్లా నలుమూలల నుంచి ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి శనివారం పవన్ పాల్గొననున్న సభ జరిగే ఇందిరామైదానం చిన్నది. ఇక్కడ 5వేల మంది జనం వస్తే అదిపూర్తిగా నిండిపోయి రోడ్లపైన నిల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈనేపథ్యంలో శనివారం తిరుపతి రోడ్డుమార్గాలు పవన్ అభిమానులతో నిండిపోవడం ఖాయం. ఈక్రమంలో ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు.