చిత్తూరు

కరవు రహిత రాష్టమ్రే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రంలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడం వలన కొన్ని ప్రాంతాలలో కరవు పరిస్థితులు ఏర్పడి వ్యవసాయం చేసేందుకు సాగునీరు కొరత ఏర్పడిందన్నారు. దీనిని అధిగమించేందుకు రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించి రెయిన్‌గన్స్ సహాయంతో వ్యవసాయం చేసేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. ఇందులో భాగంగా వర్షాలు పడని ప్రాంతాలను ఎంచుకొని ఆయా ప్రాంతాలలో రెయిన్ గన్స్ ఏర్పాటుచేసి సాగు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. రెయిన్ గన్స్ ఏర్పాటు వలన కరువు పరిస్థితి అధిగమించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలానే ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాల స్థాయిలో కరువు ఉన్న ప్రాంతాలను ఎంపికచేసుకొని ప్రతి ప్రాంతానికి ఇద్దరు లేక ముగ్గురు మంత్రులను, ఐ ఎ ఎస్ అధికారులను నియమించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.