చిత్తూరు

పోలీసు బలగాలతో గుడారాలు తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 3: సబ్ కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశాల మేరకు పోలీసు బలగాలు మండలంలోని అనాతంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ భూముల్లో పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 500 గుడారాలను శనివారం రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇందుకు నిరసనగా పోరాట సమితి సభ్యులు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. వివరాల్లో కెళితే రేణిగుంట మండలంలోని అనాతం పల్లి వద్ద పోరాట సమితి ఆధ్వర్యంలో గతనెల 15వ తేదీన ప్రభుత్వ భూమిని ఆధీనంలోకి తీసుకొని భారీ ఎత్తున పేదలు గుడారాలు వేసుకొని పోరాటం కొనసాగిస్తున్న విషయం విదితమే. దీనిపై శుక్రవారం సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు బెటాలియన్‌లతో, తిరుపతి రూరల్, అర్బన్, రెవెన్యూ సిబ్బంది కలిసి శనివారం తెల్లవారుజామున గుడారాలను తొలగించారు. అయితే గుడారాలు తొలగించే సమయంలో అడ్డుకునేందుకు వచ్చిన ఐదుగురు పోరాట సమితి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పూచికత్తుతో విడుదలచేశారు. ఇందుకు నిరసనగా పోరాట సమితి నాయకులు, మహిళలు భారీ ఎత్తున తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. తహశీల్దార్ కార్యాలయం ఎదుట పోరాట సమితి నేతలు బైఠాయించి భారీ ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెప్టెంబర్ 9వ తేదీన పేదలకు ఇళ్లజాగాలు ఇవ్వకుంటే ఆరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని మళ్లీ ముట్టడిస్తామని పోరాట సమితి నాయకులు హెచ్చరించారు. అనంతరం ధర్నా విరమించుకొని వెనుదిరిగారు. అంతకు ముందు ప్రభుత్వ భూముల్లో గుడారాలు తొలగించే సమయంలో భారత పతాకం చెట్లలో పడి ఉండటాన్ని గమనించిన కానిస్టేబుల్ గురుప్రసాద్ జెండాకు కట్టిన కర్రను తీసివేసి జెండాను మడిచి డి ఎస్పీ నంజుండప్పకు ఆయన కానిస్టేబుల్‌ను అభినందించారు.