చిత్తూరు

కుంభాభిషేకానికి ఘనంగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 8: శ్రీ కాళహస్తీశ్వరాలయానికి కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని దేవస్థానం ట్రస్టుబోర్డు ఛైర్మన్ గురవయ్యనాయుడు తెలిపారు. గురువారం ఆయన దేవస్థానం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కుంభాభిషేకానికి సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే గోపురకలశాలకు బంగారు తాపడం చేయించడానికి నిర్ణయించామని, దాతలు సహకరించాలని కోరారు. స్వామివారి ధ్వజస్థంభానికి కూడా బంగారుపూత వేయిస్తామన్నారు. ధ్వజస్థంభానికి, గోపుర కలశాలకు బంగారు పూతవేయిస్తే ఆలయానికి ప్రత్యేక కళ వస్తుందన్నారు. ఇటీవల దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె ఎస్ వి ప్రసాద్ వచ్చిన సందర్భంగా ఆయన సూచనలు మేరకు అన్నదాన మండపాన్ని శివసదన్‌కు మార్పుచేస్తామన్నారు. అన్నదానమండపంలో లడ్డూ ప్రసాదాల తయారీ, వెండినాగపడిగల తయారీని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల ఆలయంలోపల ఇతర కార్యక్రమాలు ఉండకుండా చేయడమే వీరి ఉద్దేశ్యమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రథాలను కాణిపాకం దేవస్థానంకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని, అయితే స్థానిక ఎమ్మెల్యే అయిన అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రథాలను తయారుచేయించారని తెలిపారు. అందువల్ల మంత్రితోపాటు ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు అందరూ సమ్మతిస్తేనే రథాలను కాణిపాకం దేవస్థానానికి ఇచ్చే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా తక్కువ ఎత్తుతో రథాలను తయారుచేయించడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. ఆలయానికి విరాళాలు ఇచ్చే దాతకు నేరుగానే కాకుండా ఆన్‌లైన్ విధానంలో కూడా ఇచ్చే విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ట్రస్టుబోర్డు సభ్యులు గుర్రప్పశెట్టి, రమేష్, బాలాజి, ప్రమీలమ్మ, సంబందంగురుకుల్, ఇ ఓ బ్రమరాంభ, ఎ ఇ ఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.