చిత్తూరు

శేషవాహనంపై ఊరేగిన శివపుత్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 9: వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు ఉత్సవ మూర్తులైన సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి పెద్దశేషవాహనంపై విహరించారు. ఉత్సవానికి కాణిపాకం, కాకర్లవారిపల్లి, వడ్రాంపల్లి, మిట్ట ఇండ్లు, కొత్తపల్లి, అడపగుండ్లపల్లి, బొమ్మసముద్రం, తిమ్మోజపల్లి, తిరువణంపల్లి, అగరంపల్లికు చెందిన ఖమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారి మూల విరాట్‌కు ప్రత్యేక అభిషేకం చేసారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలుచేసి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి పెద్దశేషవాహనం నిర్వహించారు. సిద్దిబుద్ధి సమేత వినాయకస్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి అలంకార మండపంలో ఆశీనులు చేసి పూజలు చేసారు. అనంతరం ఉత్సవ మూర్తులను పెద్ద శేషవాహనంపై ఉంచి కాణిపాకం పురవీధుల్లో మేళ తాళాల మధ్య ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి వారి కోర్కెలు తీర్చుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ ఇఒ పూర్ణచంద్రరావు, ఎసి వెంకటేష్, ఎఒ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్రబాబు, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.
చిన్నశేషవాహనంపై ఊరేగిన గణనాథుడు:
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సిద్దిబుద్ధి సమేతుడైన వినాయకస్వామి వారు పగలు చిన్నశేష వాహనంపై కాణిపాకం పురవీధుల్లో విహరించారు. ముందుగా స్వామివారి ఉత్సవ మూర్తులను చిన్నశేషవాహనంపై వేంచేపచేసి అశేష భక్తజనం చూస్తుండగా కాణిపాకం వీదుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వాహనం మాడవీధుల్లో ముందుగా కోలాటాలు, చెక్క భజనలతో తిరుమల తరహాలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఇఒ పూర్ణచంద్రరావు, ఎసి వెంకటేష్, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా అష్టోత్తర కలశం ఊరేగింపు:
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి అత్యంత వైభవంగా చిన్న, పెద్ద శేషవాహనాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శత కలశ పంచామృత అభిషేకం నిర్వహించారు. ఉదయం అష్టోత్తర శత కలశాలను మణికంటేశ్వరస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. అనంతరం ఉత్సవ మూర్తులకు అలంకార మండపంలో ప్రత్యేక వేధికపై ఉంచి పాలు, నెయ్యి, తేనే, పెరుగు, వీబూది, సుగంధ ద్రవ్యాలతో భక్తులు చూస్తుండగా సాంప్రదాయ పద్దంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను అలంకరించి దూప దీప నైవేద్యాలు చేపట్టారు. ఈకార్యక్రమంలో ఆలయ ఇఒ పూర్ణచంద్రరావు, ఆలయ స్బిబంది, ఉభయదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కాణిపాకంలో నేడు
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వృషభ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం ఆర్యవైశ్యులు అభిషేకం ఉభయదారులుగా, రాత్రి గ్రామోత్స వానికి కాణిపాకం, సంతపల్లి, మారేడుపల్లి, ముదిగోళం, చిత్తూరు, శాలి వాహన వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.