చిత్తూరు

2022 నాటికి పేదలందరికీ గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 11: 2022 నాటికి పేదవారందరికీ గృహాలు అందించాలనే లక్ష్యంతోతమ ప్రభుత్వం ఉందని రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రి నారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన పాడిపేడ, వికృతమాల ప్రాంతాల్లో పేద వారికి నిర్మిస్తున్న గృహ పనులను, అలాగే ఇందిరమ్మ ఇళ్లలో నివసిస్తున్న వారి ఇబ్బందులను ఎమ్మెల్యే, కలెక్టర్, మునిసిపల్ కమిషనర్‌లు స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడతూ నిర్మాణాలలో నాణ్యతాలోపాలు ఉండకూడదని అధికారులు హెచ్చరించారు. ప్రజలు నివసించడానికి వీలుగా అవసరమైన అన్ని వౌళిక సదుపాయాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వివిధ పథకాల కింద ధరఖాస్తులు చేసుకున్న వారికోసం 9,216వేల ఇండ్లను జూన్ నాటికి పూర్తిచేయాలన్నారు. లాటరీ పద్దతిలో ఇళ్లు కేటాయించాలన్నారు.
తదుపరి లీలామహల్ సర్కిల్ ప్రాంతంలో యానాది కాలనీలో నివశిస్తున్న వారి ఇళ్లను స్వయంగా వెళ్లి పరిశీలించారు. అక్కడ ఇబ్బందులను గుర్తించారు. సౌకర్యవంతమైన ఇళ్లుకల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఇక్కడ ఉన్న ఇళ్లకు అద్దె చెల్లించడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఉన్న 360 కుటుంబాలకు సొంత ఇళ్లు కట్టివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.