చిత్తూరు

ప్రతిపక్షాలు విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 13: నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి, అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు పాటుపడుతున్నారని, విపక్షాలు ఆయనపై విమర్శలతో అడగడుగున అడ్డుకోవడం సమంజసం కాదని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా రావాలనే టిడిపి కోరుకుంటోందన్నారు. అందుకు కేంద్రంతో పోరాడుతోందని చెప్పారు. టిడిపి ప్రత్యేక హోదాకు అడ్డు అని ప్రతిపక్షాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. విమర్శలు మాని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి నర్సింహయాదవ్ మాట్లాడుతూ పోలవరం, ప్రత్యేక ప్యాకేజీని కాదనమంటారా? ఇచ్చేవాటిని వద్దంటే రాష్ట్రానికి నష్టం కాదా అని ప్రశ్నించారు. ఇచ్చేది స్వాగతిస్తూనే ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పట్టణ అధ్యక్షులు దంపూరి భాస్కర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని విమర్శలు మాని సూచనలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సిపాయ్ సుబ్రమణ్యం, జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఆర్ సుధారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరా సుధాకర్ రెడ్డి, శింగం శెట్టి సుబ్బరామయ్య, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.