రాష్ట్రీయం

దోషుల్ని వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్‌మనీ కేసులో ఎవరూ తప్పించుకోలేరు
అసెంబ్లీలో సిఎం చంద్రబాబు స్పష్టీకరణ
నిందితుడితో విదేశాలకు వెళ్లిన ఎమ్మెల్యేను విచారించరా
నిలదీసిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 17: ‘కాల్‌మనీ రాకెట్ కేసులో నిందితులెవరూ చట్టంనుంచి తప్పించుకోలేరు. ఎవరు తప్పు చేసినా వదలిపెట్టం. 18వ తేదీ శుక్రవారం ఈ అంశంపై ప్రకటన చేస్తున్నాం. సాక్ష్యాధారాలు తెస్తే వాటిని ప్రాతిపదికగా చేసుకుని దోషులెవరైనా, ఏ పార్టీ వారైనా, ఎటువంటి ఒత్తిడులకు లోనుకాకుండా కఠినంగా చట్ట ప్రకారం శిక్షించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. గురువారం శాసనసభలో వైకాపా సభ్యులు పోడియంను చుట్టుముట్టి కాల్‌మనీ రాకెట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని పై విధంగా అన్నారు. బిఏసి సమావేశంలో నిర్ణయించినట్లుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు పునరంకితమవుదామని, సమాజానికి మంచి సందేశమిస్తామని, ఈ అంశంపై చర్చకు సహకరించాలని ఆయన కోరారు. అయినా వైకాపా ఎమ్మెల్యేలు పోడియం వద్ద నినాదాలు కొనసాగించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైకాపా ఎమ్మెల్యేలు హుందాగా ప్రవర్తించాలి. అంబేద్కర్‌పై చర్చిద్దాం అని బిఏసిలో అనుకున్నాం. మీ సభ్యులు కూడా అంగీకరించారు. వీరి ప్రవర్తిన చూస్తుంటే నాగరిక ప్రపంచం సిగ్గుతో తలవంచుకునే విధంగా ఉంది. ప్రజలు ఈ విధానాన్ని హర్షించరు. సహకరించాలని మరోసారి కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.
అంతకు ముందు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ‘కాల్‌మనీ రాకెట్‌లో దోషులు చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి. దోషులతో కలిసి ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్లారు’ అని అన్నారు. జగన్ మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్ చేశారు. ఒకసారి వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత ఆ అంశంపై మాట్లాడేందుకు అనుమతి ఇచ్చే ప్రసక్తిలేదన్నారు. మరోసారి స్పీకర్ జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినప్పుడు జగన్ మాట్లాడుతూ ‘నిజంగా పైనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. రాజకీయ అవసరాల కోసం అంబేద్కర్‌ను ఉపయోగించుకుంటున్నారు. సాక్షాత్తూ మీ పార్టీ ఎమ్మెల్యే కాల్‌మనీ రాకెట్ నిందితులతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఎమ్మెల్యే తిరిగి వచ్చారు. నిందితుడు తిరిగి రాడు. ఈ అంశంపై పోలీసులు విచారణ చేయరు. ఇంత దారుణం జరుగుతోంది’ అని అన్నారు. ఈ సమయంలో స్పీకర్ మరోసారి జగన్ మైక్‌ను కట్ చేశారు. దీంతో సభలో మళ్లీ గలభా జరిగింది. (చిత్రం) అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సిఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టిడిపి ఎమ్మెల్యేలు