శ్రీకాకుళం

‘కరెన్సీ’ కాన్పులు ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 25: నిండు గర్భవతి.. రిమ్స్ ఆసుపత్రిలో కాన్పు కోసం వస్తే ఐదురోజులు ఇన్‌పెషెంట్‌గా ఉంచి.. రాత్రికి రాత్రి ప్రైవేటు నర్సింగ్‌హోంకు తరలించి ఓ రిమ్స్ వైద్యుడు ‘కరెన్సీ’ కాన్పు కోసం కత్తెర పట్టి కడుపుకోసిన వైనం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది.
ఆమదాలవలస నియోజకవర్గంలో కొర్లకోట గ్రామానికి చెందిన మేటికోటి భారతి అనే గర్భవతి రిమ్స్ ఆసుపత్రిలో ఈ నెల 20వ తేదీన ఇన్‌పెషెంట్‌గా చేరేందుకు వచ్చింది. ఆమెను 21వ తేదీన రిమ్స్ ప్రసూతి వార్డులో ఇన్‌పెషెంట్‌గా చేర్చుకున్న అక్కడ సిబ్బంది 24వ తేదీ అర్ధరాత్రి వరకూ ఎటువంటి వైద్యసేవలు అందించకుండా, రాత్రికిరాత్రి ఆమదాలవలసలో గల ఒక ప్రైవేటు నర్సింగ్‌హోంకు తరలించి, అక్కడ రిమ్స్‌లో ఏ వైద్యులైతే సేవలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారో, అదే వైద్యుడు సర్జరీ చేసి పదివేల రూ.లు గుంజాడు. నాలుగురోజుల కిందటే ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సహించేది లేదంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం జిల్లా వైద్యఆరోగ్యశాఖ నెలవారీ సమీక్షలో హెచ్చరించడం, ప్రభుత్వ జీతం తీసుకుని ప్రైవేటు నర్సింగ్‌హోంలలో పనిచేస్తే తమ విధులకు రాజీనామా చేయమంటూ కరాఖండిగా చెప్పిన కొద్దిరోజులకే ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.
ఆ ఇన్‌పెషెంట్‌కు రిమ్స్ వైద్యులు తొలుత ఈ నెల మూడోతేదీ ప్రసవం తేదీగా నిర్ధారణ చేయడంతో ఆ రోజు వైద్యసేవల కోసం భారతి కొర్లకోట ఆరోగ్యకార్యకర్త సహాయంతో రిమ్స్‌కు వచ్చింది. మరో 12 రోజులు తర్వాత ప్రసవం అవుతుందని ఈ నెల 16వ తేదీగా పేర్కొంటూ గర్భిణీని పంపేశారు. ఈ నెల 20న ఇంటివద్ద నొప్పులు పడడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్థానిక మహిళా ఆరోగ్యకార్యకర్త తరలించడంతో నాలుగురోజులు రిమ్స్‌లో వైద్యసేవలు అందించకుండా నిర్లక్ష్యం చేసి, చివరి నిమషంలో సహజ ప్రసవం చేసేందుకు డాక్టర్ శశికళా ప్రయత్నించగా, ఫలితం దక్కలేదు. అంతకుముందు రోజుల్లో అక్కడ గల ఇద్దరు డాక్టర్లు గర్భవతిని పరీక్షలు నిర్వహించకుండానే సమయం పడుతుందంటూ చెప్పేవారు.
గురువారం రాత్రికి రాత్రి గర్భవతి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు చేతులెత్తేయడంతో పేదకుటుంబానికి చెందినవారైనా కార్పొరేట్ వైద్యం కోసం పరుగులు తీయాల్సివచ్చింది. ఆమదాలవలసలో గల ఒక ప్రైవేటు నర్సింగ్‌హోంలో చేరడంతో అక్కడకు కూడా రిమ్స్ వైద్యుడు ప్రత్యక్షమై కడుపు కోతకోసి బిడ్డను తీశారు. ఈ తంతు అంతా కేవలం ‘కాసుల’ కాన్పుల కోసమేనంటూ బాలింతరాలు భారతి ఆరోపించింది.
ఇదిలావుండగా, జిల్లాలో ప్రతీ నెలా 100 మందికిపైగా గర్భిణులు ఇళ్లలోనే పురుడుపోసుకుంటున్నారు. ఇప్పటికీ ఈ దుస్థితి ఏమిటని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ప్రశ్నిస్తే ఈ ఏడాది ఇళ్లలో కాన్పుల సంఖ్య తగ్గిందని సమాధానమిస్తున్నారు. రిమ్స్, జిల్లా ఆసుపత్రిలో 18 క్లస్టర్లు, నాలుగు వైద్యవిధానపరిషత్ ఆసుపత్రులు, సిమాంక్ కేంద్రాలు, రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 478 ఉపకేంద్రాలు సేవలందిస్తున్నాయి. వైద్యఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద అధికశాతం నిధులు మాతాశిశు మరణాలు తగ్గించడానికి వెచ్చిస్తున్నారు. మార్పు పథకం, 108 సేవలు వీటన్నింటికీ అదనం. ఇంతటి వైద్యసేవలు, అందుబాటులో రవాణా సౌకర్యం ఉండీ సరాసరిన ప్రతీ నెలా 150 మంది ఏటా రెండు వేల వరకూ కాన్పులు ఇళ్లలోనే అవుతున్నాయి.
2012-13 సంవత్సరంలో 2569, 2013 - 14లో 2012, 2014 - 15లో 2200, 2015 - నవంబర్ వరకూ 823 మంది గర్భిణులు సర్కార్ వైద్యం కోసం ప్రభుత్వ దావఖాణాలకు వెళ్ళి మరల అక్కడ పనిచేసే వైద్యుల నర్సింగ్‌హోంలకు, వారికి సంబంధించిన బంధువులు, స్నేహితుల కార్పొరేట్ హాస్పటళ్ళకు రాత్రికిరాత్రి అత్యవసరంగా ఇన్‌పెషెంట్‌గా చేరితేగాని, తల్లీపిల్లకు సురక్షితం లేకుండాపోయేలా పరిస్థితులు సృష్టిస్తున్న రిమ్స్‌లో ప్రసవాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి.
ఎస్‌పీహెచ్‌వో డాక్టర్ జగన్నాథం వివరణ
సహజ కాన్పు కోసం రిమ్స్ వైద్యులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరో రెండురోజల తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పినప్పటికీ, భయంతో ప్రైవేటు నర్సింగ్‌హోంకు కొర్లకోటకు చెందిన భారతి అనే గర్భవతి వెళ్ళిపోయారని ఎస్‌పీహెచ్‌వో డాక్టర్ జగన్నాథం తెలిపారు.
ప్రైవేటు నర్సింగ్‌హోంలో ప్రభుత్వ వైద్యుడు ఆపరేషన్ చేసిన విషయం తనకు సంబంధం లేదంటూ ఆయన ‘ఆంధ్రభూమి’కి వివరణ ఇచ్చారు.

చలిగాలులు!
శ్రీకాకుళం, డిసెంబర్ 25: వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల సముద్ర తీరం వెంబడి చలిగాలుల తీవ్రత పెరిగింది. రెండు రోజులుగా వణికిపోతున్నారు. సీజనల్ వ్యాధుల బారినపడి మంచాన పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెచ్చరికలు జారీచేయడమే కాకుండా జ్వరంతో ఆసుపత్రికి వచ్చే రోగికి తక్షణమే రక్తపరీక్షలు నిర్వహించి, అనుమానం ఉన్న వారికి జిల్లా కేంద్రంలోని
రిమ్స్‌కు పంపించి మరింత మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిఎం అండ్ హెచ్‌ఒ ఆదేశాలు జారీ చేశారు. కాగా, సముద్ర తీరం వెంబడి ప్రాంతాల్లో ఈ ప్రభావం మరో పది, పనె్నండు రోజులు కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ నిపుణుడు డాక్టర్ జె.జగన్నాథరావు శుక్రవారం రాత్రి తెలిపారు. సాధారణంగా ఉండే పగటి ఉష్ణోగ్రత కంటే శనివారం అయిదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందన్నారు. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు ఆరుబయట తిరగకూడదని ఆయన సూచించారు.
అక్కడక్కడ చలిగాలులు తీవ్రతతో పాటు చిన్నచిన్న జల్లులు కురిసే అవకాశం ఉందంటున్నారు. హిందూ మహా సముద్రంలో ఆగ్నేయానికి 500 కిలోమీటర్లు మేర అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, ఈ ద్రోణి ప్రభావం బంగాళాఖాతం తీరం వెంబడి ఆవహించి ఉండటంతో రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం లేకపోలేద పేర్కొన్నారు.