హైదరాబాద్

బోదకాల బాధితులకు ఇక నుంచి వెయ్యి పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: సమాజంలో వివిధ వర్గాలకు చెందిన నిస్సాహాయులను ఆదుకోవడానికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇక నుంచి బోదకాలు బాధితులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రతీ నెలా రూ.వెయ్యి పెన్షన్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్) నుంచి అందజేయడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రాష్టవ్య్రాప్తంగా 47 వేల మంది బోదకాల బాధితులకు పెన్షన్ అందనుందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎంపి కల్వకుంట్ల కవిత తమ నియోజకవర్గ ప్రాంతాల్లో బోదకాల బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాలు తీసి కాలు వేయలేని స్థితిలో బోదకాల బాధితులు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించి వీరికి పెన్షన్లు ఇవ్వాలని సిఎం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రోగాన్ని నయం చేయడం కంటే ముందు జాగ్రత్తే మేలు అనే మాటను ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుచుకుందని సిఎం అన్నారు. దీని కోసం గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రజలందరికీ ప్రభుత్వమే రోగ నిర్ధారక పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పని చేసే వైద్య అధికారులు, సిబ్బంది సేవలను మరింత ప్రభావంతంగా వినియోగించుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దీంట్లో భాగంగా ఆశ వర్కర్లకు మరోసారి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అలాగే సెకండ్ ఎఎన్‌ఎంలకు కూడా వేతనాలు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇలా ఉండగా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతీ ఒక్కరూ ఎప్పటికప్పుడు రోగ నిర్థారక పరీక్షలు చేయించుకుంటారని, రాష్ట్రంలో కూడా ప్రజలకు అలాంటి అలవాటు నేర్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధిని తొలి దశలోనే గుర్తించి నయం చేయడం తేలిక అవుతుందన్నారు. బోదకాలు కూడా అలాంటిదేనన్నారు. ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయవచ్చన్నారు. చాలా రోగాల విషయంలో ఇలాగే జరుగుతుందన్నారు. ఇకపై ఇలా జరుగకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వమే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కెసిఆర్ కిట్స్ ఇవ్వాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి తిరస్కరించారు.